ఏపీకి వచ్చేయండి.. టాలీవుడ్ కు పవన్ కళ్యాణ్ పిలుపు ?
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గిరిజన ప్రాంతాలలో... ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ అందాలను ఆస్వాదిస్తున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచు పడుతున్న నేపథ్యంలో ఫోటోలు కూడా దిగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఒక ఐడియా వచ్చింది.
ఆ ప్రాంతాల్లో సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి పిలుపునివ్వాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి... కీలక పిలుపు ఇచ్చారట పవన్ కళ్యాణ్. సినిమా షూటింగ్ లు చేయాలనుకుంటే... అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి కొండల్లో... షూటింగ్ చేసుకోవాలని... విజ్ఞప్తి చేశారట ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
హైదరాబాదులో కంటే సుందరమైన ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయని... అవి సినిమా పరిశ్రమకు చాలా చక్కగా ఉపయోగపడతాయని కూడా కొనియాడారు. వెంటనే టాలీవుడ్ పెద్దలందరూ ఒక్కసారి వీక్షించాలని కూడా విజ్ఞప్తి చేశారట ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే రేవంత్ రెడ్డి వర్సెస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య పంచాయతీ జరుగుతున్న నేపథ్యంలో... డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడంతో రచ్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ హీరో అల్లు అర్జున్ మధ్య పంచాయతీ కొనసాగుతున్న తరుణంలో... పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద వివాదంగా చూస్తున్నారు.