ఏపీ: ఐటీ,ఇతర ఉద్యోగులంతా ఆ పార్టీకే ఓటు వేసారట..!

Pandrala Sravanthi
ఏపీలో ఎన్నికలు ముగిసాయి.అన్ని పార్టీల నాయకులు ఎన్నికల రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. టిడిపి కూటమి,వైసిపి ఇద్దరు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం ఒక అడుగు ముందుకేసి  151 కి పై అసెంబ్లీ 22 పార్లమెంటు స్థానాల్లో విజయ దుందుభి ఎగరవేస్తామని చెప్పకనే చెప్పారు.  ఇక టిడిపి కూటమి కూడా గెలుపు పై గట్టి నమ్మకంతోనే ఉంది. ఇదే తరుణంలో ఈసారి రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగింది.  ముఖ్యంగా మహిళలు,వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇలా వీరి ఓటింగ్ శాతం పెరగడం  వైసిపి కి ప్లస్ అయిందని కొంతమంది అంటే ప్రభుత్వ వ్యతిరేకతతో వీరంతా గంపగుత్తగా టిడిపికి వేశారని మరి కొంతమంది అంటున్నారు. 

ఇక ఇదే తరుణంలో వీరి ఓట్లే కాకుండా ఏపీ నుంచి చాలామంది ఉద్యోగాలు,వ్యాపారాలు బ్రతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు ఇతర రాష్ట్రాల్లో బ్రతకడానికి వెళ్లారు. అయితే వారు ఆ పట్టణాల్లో ఉన్నా ఓట్లు మాత్రం ఏపీలోనే ఉన్నాయి. అయితే మే 13వ తేదీన చాలామంది వలస వెళ్లిన వారు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో ఉద్యోగాలు చేసేవారు విద్యార్థులు  మూకుమ్మడిగా  జగన్ కే ఓటు వేసినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఆయన రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.  అమ్మ ఒడి వంటి ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందించారు. 

ఈ అమ్మ ఒడి ద్వారా చాలామంది చదువుకొని పై చదువుల కోసం హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కొంతమంది జాబులు చేస్తున్నారు. వీరంతా కలిసి జగన్ పాలనే బాగుందని, ఆయన కరోనా సమయంలో కూడా ఎంతో ఆదుకున్నారని, అన్ని రంగాల ప్రజలను అభివృద్ధి పరచడంలో ముందుకెళ్లారనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగని టిడిపిని తిట్టలేం. కానీ వారి పాలనలో ఇంత అభివృద్ధి జరగలేదు. కొంతమంది టీడీపీకి అభిమానులు ఉన్నా కానీ , ఓటు మాత్రం వైసిపికే వేశారట.దీనికి కారణం ఆయన చేసిన అభివృద్ధి, ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవడం యూత్ ను ఉద్యోగులను ఇతర వ్యక్తులను చాలా అట్రాక్ట్ చేసింది.దీంతో ఇలా విజన్ ఉన్న సీఎం అయితేనే బాగుంటుందని పట్టణాల నుంచి వచ్చిన ఓటర్లంతా వైసీపీకే పట్టం కట్టినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: