బెంగళూరు... చెన్నై మధ్య 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే... బెంగళూరు గెలవాలి అంటే అలా జరగాల్సిందే..?

Pulgam Srinivas
ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బెంగళూరు చిన్న స్వామి స్టేడియం లో మ్యాచ్ జరగనుంది. ఈ రోజు రాత్రి జరగబోయే మ్యాచ్ కి వర్షం అడ్డంకి అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ వెల్లడించినట్టుగానే ప్రస్తుతం బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో వర్షం పడుతుంది. ఇక ఈ వర్షం అలాగే రాత్రి వరకు కొనసాగినట్లు అయితే ఈ రోజు మ్యాచ్ 20 ఓవర్లు జరిగే అవకాశం ఉండదు. కాకపోతే చిన్న స్వామి స్టేడియంలో సబ్ ఎయిర్ సిస్టమ్ ఉండడంతో ఒక వేళ భారీ వర్షం కురిసిన కానీ 5 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

ఒక వేళ చిన్న స్వామి స్టేడియంలో వర్షం భారీగా కురిసినట్లు అయితే 5 ఓవర్ల మ్యాచ్ కనక జరిగితే ఎలాంటి సమీకరణాలతో చెన్నై జట్టు ను బెంగుళూరు జట్టు ఓడిస్తే ప్లే ఆప్స్ కి చేరే అవకాశం ఉంది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ రోజు చిన్న స్వామి స్టేడియంలో ఒక వేళ 5 ఓవర్ల మ్యాచ్ కనుక జరిగినట్లు అయితే ఐదు ఓవర్ లలో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీం 80 రన్స్ ను కనుక చేసినట్లయితే చెన్నై ని 62 పరుగులకే నియంత్రించవలసి ఉంటుంది.

ఇక ఒక వేళ చెన్నై సూపర్ కింగ్స్ కనుక మొదట బ్యాటింగ్ చేసినట్లు అయితే వారు బెంగళూరు కు ఇచ్చిన టార్గెట్ ను ఈ జట్టు 3.1 ఓవర్లలో సాధించవలసి ఉంటుంది. అలా జరిగిన బెంగుళూరు జట్టు ప్లే ఆప్స్ లోకి వెళుతుంది. ఎలా అయినా కూడా భారీ తేడాతో బెంగళూరు జట్టు చెన్నై ని ఓడించినట్లు అయితే ఈ సీజన్ లో బెంగళూరు జట్టు ప్లే ఆప్స్ లోకి వెళుతుంది. మరి ఈ రోజు మ్యాచ్ తో ఈ సీజన్ లో ప్లే ఆఫ్ లోకి వెళ్ళబోయే నాలుగవ జట్టు ఏది అనేది తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: