లేడీ విలన్ తో బాలయ్య బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధం..!

Divya
నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబి కాంబినేషన్లో nbk -109 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బాలయ్య మరొకసారి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల వ్యవహారాన్ని మాత్రం ఇప్పటివరకు తెలియజేయలేదు చిత్ర బృందం. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో నటి శ్రియా రెడ్డి కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రియా రెడ్డి అంటే కచ్చితంగా నెగిటివ్ షెడ్ కలిగే ఉన్న పాత్రే నటిస్తూ ఉంటుందని చెప్పవచ్చు.

ముఖ్యంగా శ్రియా రెడ్డికి కూడా ఇలాంటి పాత్రలే మంచి పేరు తీసుకువచ్చాయి... గత ఎడాది ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో కూడా ఈమె నటించడంతో ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది. బాలయ్య సినిమాలో కూడా మరొకసారి తన వీళ్ళనిజాన్ని  చూపించడానికి శ్రీయా రెడ్డి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. తను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే శ్రియా రెడ్డి త్వరలోనే సినిమా షూటింగ్లోకి జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయట.

ముఖ్యంగా బాలయ్య గెటప్స్ అండ్ చాలా స్టైలిష్ లుక్కులో కనిపించబోతున్నారని బాలయ్యను చూసి త్రిల్ గా ఫీల్ అవుతారని చిత్ర బృందం తెలియజేస్తోంది.ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, విలన్ గా బాబి డియోల్, చాందిని చౌదరి తదితరులు సైతం ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోని తెరకెక్కిస్తూ ఉన్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తూ ఉన్నారు. గడిచిన రెండు సినిమాలు కూడా తమన్ కే అవకాశం ఇచ్చారు బాలయ్య.. మరి ఈసారి తన రీ సౌండ్ తో అభిమానులను పిచ్చెక్కిస్తారేమో చూడాలి. ఇటీవల ఎన్నికలలో  బిజీగా ఉన్న బాలయ్య..పూర్తి అవ్వడంతో తిరిగి మళ్ళీ బాలయ్య సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: