ఇక ఈ మధ్య కాలంలో ఏదైన చిత్రానికి సంబంధించి ఏదైన పోస్టర్ రిలీజ్ అయింది అంటే చాలు వెంటనే అది పలానా సినిమా నుండి కాపీ కొట్టారంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతుంటారు. తాజాగా ఏజెంట్ సినిమా పోస్టర్ని కూడా కాపీ చేసినట్టు ఓ వార్త వైరల్‌గా మారింది.అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఏజెంట్.ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇంకా సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. ఇక హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్ విడుదల కాగా, ఇవి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంచు పర్వతాల్లో మొహం నిండా గాయాలతో ఉన్న హీరో అఖిల్ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఈ లుక్ ని కాపీ కొట్టారని చర్చ నడుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పర్వతాలు, గిరజాల జుట్టు ఇంకా పోనీటైల్‌తో స్టైలిష్‌గా ఉన్న అఖిల్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టీవీ సిరీస్‌లోని హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్)ను గుర్తు చేస్తున్నట్లు అది కనిపిస్తోంది.
ఇక ఆ సిరీస్‌లో తరహాలోనే ‘ఏజెంట్’ మూవీలో అఖిల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఊల్ కోట్ ని ధరించి కనిపిస్తున్నాడు. చిన్నపాటి మార్పు తప్ప ఇద్దరి గెటప్పులో పెద్ద చేంజ్ లేదని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే ‘ఏజెంట్’ చిత్రం హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ ‘బోర్న్’ ఆధారంగా కూడా తెరకెక్కనుంది. ఈ క్రమంలో మరో హాలీవుడ్ సిరీస్‌లోని హీరోను కాపీ కొట్టడం ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.పాపం అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ చిత్రం అఖిల్‌కు మాత్రం కమర్షియల్ హిట్టును అయితే ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు అఖిల్.