వామ్మో :ఇదేందయ్యా ఇది.. మంచు అక్క మాములుగా లేదుగా..!

murali krishna
ఆ మాత్రం కళాపోషణ ఉండాలయ్యా లేకపోతే గొడ్డుకు మనిషికి తేడా ఎట్టుట్టాది?' అన్నాడు మన పాపులర్ విలన్ అయినా రావుగోపాలరావు.. అసలే అది మంచు ఫ్యామిలీ..ఎప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తారో వారికే తెలియదు.. అలాంటి వంశం నుంచి వచ్చిన ఆడకూతురు కూడా ఈ మధ్య అదో మాదిరి ప్రవర్తిస్తోంది. జిమ్ చేయడాలు కురచ కురచ దుస్తులు వేసుకొని హాట్ ఫోజులు ఇవ్వడము ఇలా మంచు మోహన్ బాబు ఏకైక కూతురు మంచు లక్ష్మీ వేస్తున్న వేషాలపై సోషల్ మీడియాలో సెటైర్లు మాములుగా పేలటం లేదు.

ఎవరు తీశారో ఎప్పుడు తీశారో అస్సలు తెలియదు కానీ.. ఒక్క ఫొటో అందరి దృష్టిని బాగా ఆకర్షించిందట.. అది మంచు లక్ష్మీ రాములమ్మలా గెటప్ వేసుకొని నల్లటి దుస్తులు వేసుకొని పంజా విసురుతున్న ఈ పిక్ బాగా వైరల్ అవుతోంది.అప్పట్లో విప్లవ  సినిమాల్లో రాములమ్మ ఎలానైతే నక్సలైట్ గా మారి విలన్లను ఎలా చెండాడిందో అచ్చం అలాంటి గెటప్ ను వేసుకొని మంచు లక్ష్మీ తన ముచ్చట తీర్చుకుందట.. బెబ్బులిలా తన పంజా విసురుతూ ఓ పిక్ ను విడుదల చేసింది.
ఇకేం ముంది నెటిజన్లు మాములు పండుగ చేసుకోవట్లేదుగా మన మంచు వారి అమ్మాయి కళాపోషణకు అందరూ ఫిదా అయ్యారు.కొందరు అయితే షాక్ అయ్యారట.మరికొందరు రకరకాల కామెంట్స్ తో ఆడుకుంటున్నారు. కొందరైతే ఈ పిక్ షేర్ చేసిన 'నవ్వొద్దు' ప్లీజ్ అంటూ కండీషన్ కూడా పెడుతున్నారట.. మొత్తానికి మంచు వారి అమ్మాయి పెట్టిన ఈ ఫోజు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఒకసారి మీరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి.ఈ మధ్య మంచు ఫ్యామిలీకి అభిమానులు ఎక్కువై పోయారు. మంచు ఫ్యామిలీ ఏ పోస్ట్ పెట్టిన కూడా తెగ వైరల్ ఆయిపోతుంది. మంచు ఫ్యామిలి లో అందరూ కూడా మోహన్ బాబు నట వారసులుగా వచ్చారు.ఆయనంత మంచి నటులు కావటం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: