హీరో విజయ్ ఇంటికి బాంబు పేలుడు బెదిరింపు ??
తమిళ ఆగ్రకథా నాయకుడు మరియు తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు . చెన్నై లో ఉన్న విజయ్ ఇంట్లో బాంబు పేలినట్లు సోమవారం రోజు తెల్లవారుజామున గుర్తుతెలియని ఓ ఆగంతకుడు చెన్నై నగరం పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్న బాంబ్ స్వాడ్ వెంటనే డాగ్ స్క్వాడ్ సహాయంతో విజయ్ ఇంట్లో తనిఖీలు చేపట్టగా అక్కడ బాంబు జాడలు కనిపించకపోవడం తో అది బెదిరింపు ఫోన్ కాల్ ఫెక్ అని గుర్తించారు.
తమిళ స్టార్ హీరో అజిత్ కూడా ఈ ఏడాది జూన్ నెలలో బెదిరింపు ఫోన్ కాల్స్ చేసారు. అంతే కాకుండా చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఆ వ్యక్తి ఫోన్ చేసిన ఆ ఆగంతకుడు హీరో అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ లో చెప్పాడు . విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి హుటాహుటిన అక్కడకు చేరుకొని బాంబ్ స్వాడ్ తో తనిఖీలు చేపట్టగా అక్కడ వారికీ బాంబ్ బెదిరింపు కు సంబంధించి ఎటువంటి అధరాలు దొరకలేదు. అది ఒక ఫేక్ బెదిరింపు కాల్ అని గుర్తించి వారు అక్కడినుండి వెళ్లిపోయారు.