టాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధంగా ఉన్న మహేష్ బాబు హీరోయిన్..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ మొదట్లో నటించిన సూపర్ హిట్ సినిమా రాజకుమారుడు. 1999లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా ప్రీతి జింటా హీరోయిన్గా నటించిన ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ జోడిగా ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ కావడంతో ఈ రెండు సినిమాలతో తనకు మంచి క్రేజ్ లభించింది. తెలుగులో ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ

 అప్పట్లో టాలీవుడ్ ప్రేక్షకులు ఈ ముద్దు గుమ్మని తెగ ఇష్టపడేవారు. సొట్ట బుగ్గలు తన అందమైన రూపం ఓవర్క్యూట్నెస్తో తన నటనతో అందరినీ మెప్పించేది. ఈ ముద్దుగుమ్మ. కానీ ఆ తరువాత తెలుగులో సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది. అలా బాలీవుడ్ వైపు మకాం మార్చేసింది. అలా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. హిందీలో అగ్ర హీరోలు సరైన నటించిన ఉంటుంది. ఆ తర్వాత 2018 నుండి సినిమాలకి దూరమైంది. అయితే 2016లో ఈమె అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ నువ్వు వివాహం

 చేసుకుంది. అలా సినిమాలకు దూరమై అక్కడే స్థిరపడింది. అయితే ఈ సినిమాలకి దూరమైన ఈమె ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ టీంకు సహ యజమానిగా వ్యవహరిస్తోంది. నిత్యం ఈమె ఎప్పుడో క్రికెట్ మైదానంలో నే కనిపిస్తూ ఉంటుంది. తన టీంను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడో సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ తాజాగా ఇటీవల హిందీలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది.  ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రీతిజింటా.. తాజాగా   అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. మీరు మళ్లీ తెలుగు ల్లో నటిస్తారా ? అని అడగ్గా.. ప్రీతి రియాక్ట్ అవుతూ.. నేను అసలు చేయను అని ఎప్పుడూ చెప్పులేదు. మంచి కథ వినిపిస్తే నో చెప్పకుండా చేస్తాను అని తెలిపింది. అయితే తెలుగులో మంచి కథ.. పాత్ర వస్తే మాత్రం ప్రీతి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: