బూతు పాట విడుదల చేసిన మెగా డాటర్ నిహారిక..!?

Anilkumar
మెగా డాటర్ నిహారిక  గురించి  ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక కొండల భర్తతో విడిపోయిన తరువాత మళ్లీ తన నటనపై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో నిర్మాతగా కూడా రాణిస్తూ బిజీగా ఉంది. హైదరాబాదులో ఒక ఆఫీసు కూడా ఓపెన్ చేసిన నిహారిక కొత్త రచయితలను దర్శకులను ఎంకరేజ్ చేస్తోంది. అయితే చాలా కాలం క్రితమే నిహారిక ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ను ఏర్పాటు చేసింది .అంతేకాదు అందులో కొన్ని ప్రాజెక్టులను సైతం నిర్మించింది. అయితే ఇటీవల కుర్రోళ్ళు టైటిల్ తో ఒక సినిమాను

 సైతం ప్రకటించింది నిహారిక . మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. అయితే నిహారిక విడుదల చేసిన కమిటీ కుర్రోళ్ళు పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఈ సినిమా నుండి ఒక పాటను కూడా విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ పూర్తిగా ఎన్నికలను ఉద్దేశించి రూపొందించినది అని అర్థమవుతుంది. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రలోభాలకు పాల్పడే వారిని డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళని విమర్శిస్తూ ఈ పాటను తీశారు. అంతేకాదు ఈ పాటలో కొన్ని బూతులు కూడా వాడేసారు. డబ్బిచ్చేటోళ్లను మింగ, ఓట్లు అమ్మేటోళ్లను మింగ,

 ఐదేళ్లకోసారి మోసపోయే గొర్రెలను మింగ... అని నేరుగా తిట్టేశారు. ఈ మింగ అనే పదానికి ఓ పచ్చి బూతుకు పర్యాయపదంగా సోషల్ మీడియాలో వాడుతారు. మొత్తానికి నిహారిక ఎన్నికల హడావుడిని క్యాష్ చేసుకోవడానికి గట్టిగానే ప్లాన్ చేసింది. పరోక్షంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసింది. ఓట్లను కొనడం, అమ్ముకోవడం తప్పని ఘాటుగా చెప్పింది. అయితే అందుకు వాడిన బూతులే దారుణంగా ఉన్నాయి. నిహారిక తన సినిమాలో ఇలాంటి బూతు సాంగ్ ఎలా పెట్టిందని నెటిజెన్స్ వాపోతున్నారు.  ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు నటుడు పృథ్విరాజ్, నాగబాబు, ఆయన సతీమణి పద్మజ, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా వరుసగా కుటుంబం మొత్తం ప్రచారం చేస్తూ రంగంలోకి దిగారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: