కమల్ మూవీ ప్లేస్ ను భర్తీ చేసిన ధనుష్..?

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ కి అనురుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అనేక కారణాలవల్ల ఈ సినిమా ఒకసారి ఆగిపోయింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభించిన ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే కంప్లీట్ అయింది.

ఇప్పటికే ఈ మూవీ.కి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ఈ సినిమాను ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో జూన్ నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో ఆ నెలలో పెద్దగా ఏ తమిళ సినిమాను కూడా విడుదల చేయడానికి మేకర్స్ ముందుకు రాలేదు.

 ఇక ఇండియన్ 2 సినిమా జూన్ నెలలో రావడం లేదు అని జూలై కి పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు రావడంతో తాజాగా ధనుష్ హీరోగా మరియు రచన , దర్శకత్వంలో రూపొందుతున్న రియాన్ మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఇండియన్ 2 మూవీ ని ధనుష్ తన రియన్ మూవీ తో భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తూ రచన , దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో రియన్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: