మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా
ఆలియా భట్ , అలీవియా మోరీస్
హీరోయిన్ లుగా
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత డి
వి వి దానయ్య నిర్మించగా ... ఈ సినిమాకు ఎం ఎం
కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాకు
v VIJAYENDRA PRASAD' target='_blank' title='విజయేంద్ర ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ...
అజయ్ దేవగన్ ,
సముద్ర ఖని ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.
ఈ
మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో
మార్చి 25 , 2022 తేదీన
థియేటర్ లలో విడుదల అయింది. ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ 1200 కోట్లకు పైగా కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాకు
ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఇలా అద్భుతమైన విజయాన్ని అందుకొని గొప్ప గొప్ప పురస్కారాలను దక్కించుకున్న ఈ సినిమాను మళ్ళీ తిరిగి
థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
మూవీ ని మే 10 వ తేదీన తెలుగు ,
హిందీ భాషలలో 2D మరియు 3D వర్షన్ లలో
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేశారు ప్రస్తుతం ఆ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ
సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.