తమ్ముడు కోసం రంగంలోకి దిగనున్న చిరు..?

Pulgam Srinivas
   మెగాస్టార్ చిరంజీవి సోదరుడు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చిరంజీవి సోదరుడు గా పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి అనేక విజయా లను అందుకొని తనకంటూ ఇండస్ట్రీ లో ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు . అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో స్థాయికి ఎదిగాడు .


తెలుగు సినీ పరిశ్రమ లో టాప్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ "జనసేన" అనే పార్టీ ని స్థాపించి రాజకీయాల వైపు దృష్టిని మళ్ళించాడు . ఇక దాని తో ఈయన రాజకీయ పనుల్లో బిజీగా పాల్గొంటూనే వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం మనకు తెలిసిందే. అందులో జనసేన పార్టీ కూడా పాల్గొంటుంది. ఇక పవన్ పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగనున్నారు. ఈయనకు , ఈయన పార్టీకి మద్దతుగా ఇప్పటికే మెగా హీరోలు ఎంతో మంది ప్రచారాలు చేశారు. చిరంజీవి కూడా తమ్ముడికి సపోర్టుగా ప్రచారం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి .   

కానీ ఇప్పటి వరకు చిరు , పవన్ కి సపోర్టుగా ఏ మాటలు కూడా మాట్లాడలేదు. ఇకపోతే మరికొన్ని రోజు ల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాగే ప్రచారాలు కూడా మరికొన్ని రోజు ల్లోనే ముగియనున్నాయి . ఈ కారణం తో చిరంజీవి మరికొన్ని రోజు ల్లోనే పవన్ కి సపోర్ట్ గా ప్రచారాన్ని చేయనున్నట్లు , అందుకు సంబంధించిన ప్రణాళికలు వేగంగా జరుగుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: