హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మాజీ సైకిల్ నేతకు కారులో కష్టాలు..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్ నియోజకవర్గం...అధికార టీఆర్ఎస్‌కు పట్టున్న స్థానం. అయితే గతంలో ఇక్కడ టీడీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. 2009, 2014 ఎన్నికల్లో ఆ పార్టీనే ఇక్కడ గెలిచింది. 2014లో టీడీపీ తరుపున ఎస్.రాజేందర్ రెడ్డి విజయం సాధించారు. అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతున్న నేపథ్యంలో రాజేందర్ రెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఇక 2018 ఎన్నికల్లో ఈయన టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సత్తా చాటారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజేందర్ రెడ్డి తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూస్తున్నారు.
అయితే నియోజకవర్గంలో అనుకున్న మేర అభివృద్ధి జరగడం లేదు. ఇక ఈయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. ఎంతసేపు కర్ణాటకలోని రాయచూర్‌లో ఉన్న వీరి విద్యా వ్యాపారంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని సమాచారం. అలాగే నారాయణ్‌పేట్‌లో ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలు కూడా ఎక్కువైపోయాయని టాక్. అటు ఎమ్మెల్యే సోదరుడు రవీందర్ రెడ్డి ఇసుక మాఫియాకు లీడర్ అని ఆరోపణలు వస్తున్నాయి.
అయితే ఎమ్మెల్యే తీరు పట్ల అసలైన టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. పదవులు అన్నీ ఎమ్మెల్యే అనుచరులకే ఇప్పించుకుంటున్నారని టాక్. అలాగే పోలీస్ పోస్టింగ్‌లు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో తనకు నచ్చిన వారితో నింపేశారని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు కాస్త నెగిటివ్ కనిపిస్తోంది.
అలాగే టీఆర్ఎస్ అంతర్గత సర్వేల్లో కూడా ఎమ్మెల్యే పనితీరుకు మంచి మార్కులు పడటం లేదని తెలుస్తోంది. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో ఈ మాజీ ఎమ్మెల్యే ....కారులో గెలవడం అనేది కాస్త కష్టమయ్యేలా ఉంది. ఇక ఇక్కడ కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో నారాయణ్‌పేట్‌లో ట్రైయాంగిల్ ఫైట్ నడిచేలా ఉంది. మరి ఈ పోరులో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: