అవిసె నూనె ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

lakhmi saranya
అవిసెలు... వీటిని ఫ్లాక్ సిడ్స్ అని కూడా అంటారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటి ఆక్సిడెంట్లు, పిచు ఎక్కువ. కాబట్టే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను నివారించటంలో అవిసెలు సమర్థమైనవిగా ఆరోగ్యం నిలువు చెబుతున్నారు. అయితే అవిసె గింజల పూర్తి ప్రయోజనం దక్కాలంటే వాటిని దంచి, పోడి చేసి లేదా నూనె రూపంలో తీసుకోవాలని చెబుతున్నారు. అవిసె గింజల నూనె ఆరోగ్య సమస్యలతో పాటు చర్మం, జుట్టు సంరక్షణలో కూడా ఉత్తమం అంటున్నారు. అవిసె గింజల నుంచి లిన్సీడ్ నూనె తీస్తారు. ఇది కొవ్వు ఆమ్లాల గొప్ప మూలం.
బలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనె చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల, ఇద్దరు వంట నూనెల కంటే అవిసె గింజలతో తయారుచేసిన నూనెను తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గింజలను నూనెలో ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటు నియంతరణకు, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మధుమేహం, కీళ్ల నొప్పులను అదుపులో ఉంచుతుంది. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాట్స్ మాత్రమే కాకుండా ఇతర పోషక విలువలు కూడా ఉన్నాయి. ఈ నూనెలోని ఫైబర్ పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది.
ఈ అవిస గింజల్లోని లిగ్నాన్స్, ఈ స్టేషన్స్ ఎముకల బలానికి మంచిదిగా దోహాదపడతాయి. ఈ గింజల్లో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందుకునే ఈ నూనెతో పాటు అవిసె గింజలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెను వాడేటప్పుడు వేడి చెయ్యకుండా ఉండేందుకు సలాడ్డలో కానీ, విడిగా కానీ తీసుకోవటం మంచిది. అవిసె గింజలను పొడి చేసుకుని కూరలు వండేసాక చల్లుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడిని రొట్టెల పిండిలో కలిపి చపాతీలు కూడా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: