స్లిప్ వాకింగ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ యోగాసనం వేస్తే చాలు...?

lakhmi saranya
చాలామందికి నిద్రలో నడిచే అలవాటు ఎక్కువగా ఉంటుంది. నిద్రలో ఎక్కడికి పడితే అక్కడికి నడుచుకుంటా వెళ్లిపోతారు. మార్నింగ్ లెగిసి చూస్తేనే కానీ తెలియదు. కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అలాంటి వారు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు క్రమం తప్పకుండా చేయటం ద్వారా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు యోగ నిపుణులు. నిద్రలో నడవటం అనేది తీవ్రమైన సమస్య. దీనిని వైద్య భాషల్లో స్లిప్ వాకింగ్ లేదా సోమ్నాంబలిజం అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్లిప్ వాకింగ్ సమస్య మెదడు రుగ్మత కారణంగా సంభవించే వ్యాధి.
ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు లేచి నడవడం ప్రారంభిస్తారు.సాధారణంగా ఇది గాఢ నిద్రలో జరుగుతుందంటున్నారు నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్లీప్ వాకింగ్ నివారణ కోసం నిర్దిష్ట చికిత్స లేదని చెబుతున్నారు. ఈ వ్యాధికి ఔషధానికి బదులుగా యోగ సహజ నివారణగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. విశేషమేమిటంటే కొన్నిసార్లు ఇంగ్లీష్ ట్రిట్మెంట్ తీసుకున్న 100% ఫలితాలు రాకపోవచ్చు. అందుకే యోగాలో ప్రత్యేక ఆసనం ప్రారంభవంతంగా ఉంటుందని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, యోగ నిద్రాసనం, కొన్ని ఇతర ఆసనాలను క్రమం తప్పకుండా ఒక నెలపాటు సాధన చేయటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
 యోగ నిపుణులు వ్యాధిని నయం చేసే యోగాసనాలను , వాటి ప్రక్రియను చాలా సులభమైన పద్ధతిలో వివరించారు. స్లీప్ వాకింగ్ ఏ వయసులోనైనా ప్రారంభం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో ఇది యుక్తవయస్సు వచ్చే సమయానికి ముగుస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది వృద్ధాప్యం వరకు కూడా కొనసాగుతుంది. అదే సమయంలో కొంతమందిలో ఈ అలవాటు పెద్ద పెరిగిన తర్వాత మొదలవుతుంది. ఇది కొన్ని తీవ్రమైన కారణాలను కలిగి ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు వ్యక్తి ఏమి చేస్తున్నారో కూడా తెలియదు. మానసిక ఒత్తిడి, అలసట లేదా సక్రమంగా నిద్రపోవటం వల్ల ఈ సమస్య తరచుగా సంభవిస్తుంది. అందుకే యోగా ఈ సమస్యను పరిష్కరించడానికి సమర్ధవంతమైన పరిస్థితిగా నిరూపించారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: