పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి ఎక్కువగా వస్తుందా...? ఇలా చేస్తే తక్షణ ఉపశమనం..!
అవేంటో చూద్దాం. నెలసరి సమయంలో కడుపునొప్పి వేధిస్తుంటే... తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిప్స్, పిజ్జా, బర్గర్ వంటివి తినకూడదు. అలాగే ఉప్పు, తీపి, కారం అధికంగా ఉండే ఫుడ్స్, ఇతర వంటకాలు, ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వీటిని తినడం వల్ల శారీరం అసౌకర్యానికి గురవుతుందని, కడుపునొప్పి మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ కారణంగా కొందరు అమ్మాయిలు ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తిగా ఆపేస్తుంటారు. అయితే తేలికపాలేదా వాకింగ్ లాంటివి చేయటం మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పైగా వీటివల్ల రుతు క్రమానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి కాస్త రిలీఫ్ పొందుతారని చెప్తున్నారు. అలాగే ఎక్కువసేపు ఏమీ తినకుండా కూడా ఉండకూడదు. శక్తి అవసరం కాబట్టి పోషకాహారం తినాలి. అయితే చక్కెర, జంక్ ఫుడ్స్, ఆయిలి ఫుడ్స్ కు మాత్రం దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. రుతుక్రమంలో హార్మోన్లు అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో మానసిక ఆందోళన, చికాకు వంటి లక్షణాలు కనిపించటం సహజమే. అలాంటప్పుడు విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. అలాగే రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకోవటం మానుకోవాలి. ఎందుకంటే నిద్రలేమి శరీరక అసౌకర్యాన్ని మరింత పెంచుతుంది. టీ, కాఫీ వంటి కెఫిన్ రిలేటెడ్ డ్రింక్స్ ను పీరియడ్స్ సమయంలో తప్పక నివారించాలి. ఎందుకంటే వీటివల్ల శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.