గ్యాస్ సిలిండర్ కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని తెలుసా..?

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ కచ్చితంగా ఉపయోగిస్తూ ఉన్నారు.. అయితే గ్యాస్ సిలిండర్ కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఈ విషయం గ్యాస్ సిలిండర్ పైన రాసి ఉంటారట..  నిర్దిష్ట కాలం వరకు మాత్రమే ఉపయోగించాలని..ఆ తర్వాత గ్యాస్ కంపెనీ దానిని కొత్త సిలిండర్ తో భర్తీ చేస్తుందని సమాచారం.. గ్యాస్ సిలిండర్ పాతది అయితే మార్చడం మంచిదని.. లేకపోతే లీక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు..

ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నప్పటికీ దాని యొక్క ఎక్స్పైరీ డేట్ ని సైతం చెక్ చేస్తూ ఉండాలి.. గ్యాస్ సిలిండర్ల పైన మూడు లైన్లు ఉంటాయి. అందులో ఒక ప్రత్యేకమైన కోడ్ కూడా ఉంటుందట.. ఇదే గ్యాస్ సిలిండర్ యొక్క గడువు తేదీని సూచిస్తుందట..A-24,B-25,C-26 లేకపోతే D-27..E- ABCD అనే కోడ్ లు కూడా సిలిండర్ గడువుని తెలియజేస్తాయి.. దీని వెనుకల రాసిన సంఖ్యలు సంవత్సరం యొక్క  సమాచారాన్ని అందిస్తాయట.. Aఅంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అని.. B అంటే ఏప్రిల్, మే ,జూన్ అని.. C అంటే జూలై, ఆగస్టు , సెప్టెంబర్ అని.. Dఅంటే అక్టోబర్, నవంబర్ , డిసెంబర్ అని నెలను సూచిస్తాయట..

ఉదాహరణకు ఏదైనా సిలిండర్ పైన A-24.. అని రాసి ఉంటే 2024 సంవత్సరంలో జనవరి నుండి మార్చి వరకు ఈ సిలిండర్ గడువు ఉంటుంది అని సమాచారం. మొత్తం సిలిండర్ జీవిత కాలము 15 సంవత్సరాలు ఉంటుంది. 15 ఏళ్లలో రెండుసార్లు సిలిండర్లు చెక్ చేస్తూ ఉంటారు. మొదటి పరీక్ష ఐదు సంవత్సరాల తర్వాత, రెండవది 10 సంవత్సరాల తర్వాత ఉంటుందట. అందుకే చాలామంది గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చేటప్పుడు దాని యొక్క ఎక్స్పైరీ డేట్ ను కచ్చితంగా పరిశీలించడం మంచిది అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇకపై మీరు కూడా గ్యాస్ సిలిండర్ను మీ ఇంటికి తెచ్చుకొనేటట్టు ఉంటే కచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ను ఒకసారి చెక్ చేసి మరి ఇంటికి తీసుకెళ్లడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: