అవకాడో వల్ల ఉపయోగాలు తెలిస్తే వదలరు...!!

Divya
అవకాడో కాయ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.. ఈ కాయను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే చాలా మంది వీటి జ్యూస్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు.. అవకాడో లో ఉండేటువంటి విటమిన్ A,C,B-6,E, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అందుకే వైద్యులు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. ఆవకాడో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఆవకాడలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల జీర్ణ క్రియ సమస్యలను దూరం చేస్తుంది. దీంతో మలబద్దక, గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. జీర్ణ క్రియ కూడా మెరుగుపరిచేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరిచేలా చేస్తుంది. ఇందులో ఉండే ఒమేగా-3, ఫ్యాట్ యాసిడ్స్ కొలెస్ట్రాలను తగ్గిస్తాయి.. దీని వల్ల గుండెకు కూడా ఎలాంటి హాని కలగాదు.. ఇందు లో ఉండే గ్లూకోజ్ శక్తిని కూడా తగ్గిస్తూ గుండె ఆరోగ్యంగా ఉండేలా ఇన్సులిన్ నిరోధకాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే ఆ ఆవకాడో రోజు కొకసారి అయినా తిన్నడం మంచిదని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉంటారు.

ఆవకాడాలో ఉండేటు వంటి ఫైబర్ అధిక బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఫైబర్ అనేది ఎక్కువ  ఆకలి వేయకుండా కూడా ఆపగలదు.. దీంతో బరువు తగ్గాలనుకునే వారు తరచు ఆవకాడో జ్యూస్ ను కానీ ఆవకాడో  తినడం మంచిది.. ఈ ఆవకాడో చర్మ రక్షణలో కూడా బెస్ట్ గా పని చేస్తుందని చెప్పవచ్చు. చర్మ కణాల పెరుగుదలకు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. స్కిన్ చాలా యవ్వనంగా కనిపించడానికి కూడా మరింత అందంగా మృదువుగా కనిపించడానికి కూడా ఈ అవకాడో సహాయపడుతుంది.. అందుకే ఆవకాడో ఎలా తిన్నా కూడా మన శరీరానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అవకాడో దరఖాస్తు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని తినడం మరింత మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: