సమ్మర్లో స్కిన్‌ ఎలర్జీ రాకుండా ఇలా చెయ్యండి?

Purushottham Vinay
స్కిన్‌ ఎలర్జీ సమస్య ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తుంది. సమంత లాంటి అందమైన హీరోయిన్స్ కూడా ఈ సమస్యతో బాధ పడుతున్నారంటే ఈ సమస్య ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ సమస్యతో బాధపడుతుంటే జీవనశైలిలో కూడా కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి సాధారణంగా చర్మంపై దురద, ఎరుపు రంగులోకి చర్మం మారడం, దద్దుర్లు లాంటి లక్షణాలు ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తాయి. మొదట్లోనే ఈ సమస్యకు చికిత్స అందించకపోతే ఎలర్జీ విస్తరించే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎలర్జీ ఒళ్లంతా పాకే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల స్కిన్‌ ఎలర్జీ సమస్యకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..తరచుగా మార్కెట్ లో లభించే కెమికల్ సబ్బులు లేదా క్రీముల వల్ల చర్మం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి కఠినమైన సబ్బు మరియు డిటర్జెంట్ వాడకూడదు.


 సింథటిక్ దుస్తులను ధరించడం తగ్గించుకోవాలి. సూర్యరక్ష్మికి ఎక్కువసేపు ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి కూడా చర్మం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.స్కిన్‌ ఎలర్జీ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ అధికంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, వాల్‌నట్‌లు, బీట్‌రూట్ వంటి ఆహారాలలో ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. వీటితో పాటు పెరుగు, ఎండుద్రాక్ష వంటి ప్రోబయోటిక్స్ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: