గ్యాస్ లీక్ అవగానే చేయాల్సిన మొట్టమొదటి పనులు ఇవే..!

Divya
పూర్వం రోజుల్లో వంటలు వండుకోవడానికి కట్టెల పొయ్యి లేదా గోబర్ గ్యాస్ ని ఉపయోగించేవారు.కానీ దానివల్ల పొల్యూషన్ జరిగి,ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయని,ఎటువంటి హాని లేని గ్యాస్ లను వాడుతూ ఉన్నాము.దీనివల్ల వంట తొందరగా అవ్వడమే కాక పొల్యూషన్ కూడా తగ్గుతుంది.కానీ ఒక్కొక్కసారి గ్యాస్ రకరకాల కారణాల వల్ల లీక్ అవుతూ ఉంటుంది.అలా లీక్ అయినప్పుడు చాలామంది అవగాహన లోపం వల్ల వేరే వేరే పనులు చేసి వారి ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు.అలా కాకుండా వారి ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలి అంటే,గ్యాస్ లీక్ అవ్వగానే కొన్ని పనులు తప్పకుండా చేయాలి.అవి ఏంటంటే
ఈ మధ్యకాలంలో కొంత మంది అజాగ్రత్త కారణంగా గ్యాస్‌ సిలిండర్లు లీకయిన సంఘటనల గురించి అడపాదడపా వినే ఉంటాం.గ్యాస్ లీక్ అయినట్టు వాసన వస్తూ ఉంటే వెంటనే అప్రమత్తం కావడం చాలా ముఖ్యం.ముందుగా గ్యాస్ అతిగా లీక్ అవ్వకుండా రెగ్యులేటర్ ని ఆఫ్ చేయాలి.ఆ తర్వాత ఆ ఇంటికి ఉన్న కిటికీలు,తలుపులు తెరచి గ్యాస్ అంతా బయటికి వెళ్లిపోయేలాగా ఏర్పాటు చేయాలి.
ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయినట్టు అనిపించిన వెంటనే ఎటువంటి స్విచ్ బోర్డులను కానీ,ఎలక్ట్రిక్ వస్తువులను కానీ ఆన్ చేయకూడదు.గ్యాస్ గ్యాస్ లీక్ అయినప్పుడు స్విచ్ ఆన్ చేయడం వల్ల సిలిండర్లు పేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మరియు గ్యాస్ లీక్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ని అసలు ఆన్ చేయకూడదు.అలా స్టవ్ వెలిగించడం వల్ల సిలిండర్ పేలి,వెలిగించిన వ్యక్తికి చాలా ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒక్కొక్కసారి గ్యాస్ లీక్ అవుతూ మంటలు వస్తూ ఉంటాయి.అలాంటి సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ చుట్టూ మంటలు వ్యాపిస్తే వెంటనే సిలిండర్‌పై తడి సంచి లేదా దుప్పటితో కప్పి వేయాలి.ఇలా చేయడం  మంట వెంటనే ఆరిపోతుంది.అనంతరం గ్యాస్‌ను ఆఫ్‌ చేస్తే సరిపోతుంది.ప్రాణహాని కూడా కలగదు.
కావున మీ ఇంట్లో కానీ,చుట్టూ పక్కల ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే పైన చెప్పిన జాగ్రత్తలు పాటించండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: