ఈ పచ్చడి తింటే వావ్ అనాల్సిందే?

Purushottham Vinay
పచ్చళ్ళని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.కొంతమందికి అయితే అన్నంలోకి ఎంత  రుచికరమైన కూరలు వున్నా కూడా ఏదో ఒక పచ్చడి కంపల్సరీ ఉండాలి.ఊరగాయ పచ్చడి కానీ,ఇంట్లో అప్పటికప్పుడు చేసిన పచ్చడి కానీ ఏదో ఒకటి కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా పప్పు, పప్పు చారు లేదా సాంబార్ చేసునపుడు అయితే మాత్రం ఏదో ఒక వేపుడుతో పాటు పచ్చడి కూడా ఉండాలి.మరి అలాంటి పచ్చడి ప్రియులకి క్షణాల్లో తయారయ్యే ఆరోగ్యకరమైన ఇంకా రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా గ్యాస్ స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి ఒక పది పచ్చిమిర్చి తీసుకొని వాటిని మధ్యకి తెంచి ఆయిల్ లో వేసుకోవాలి. తరువాత అందులోనే రెండు చిన్న సైజ్ ఉల్లిపాయ ముక్కలు,ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు,కొంచం చింతపండు,గుప్పెడు కరివేపాకు,ఒక చిన్న కట్ట కొత్తిమీరా వేసి బాగా కలిపి ఐదు నిముషాలు పాటు మగ్గనివ్వాలి.


ఇప్పుడు వీటిని ఓ గిన్నెలోకి తీసుకుని అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఐదు పెద్ద సైజ్ టమాటా ముక్కలు వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర,హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచం ఉప్పు వేసి టమాటా ముక్కలు మెత్తగా గుజ్జులా వచ్చే వరకు మగ్గనివ్వాలి.ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి, అందులోనే టమాట గుజ్జు కూడా వేసి మరీ మెత్తగా కాకుండ కొంచం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి .ఫైనల్ గా పాన్లో కొంచం ఆయిల్ వేసి జీలకర, ఆవాలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి. ఇక ఈ పోపుని పచ్చడిలో వేసి బాగా కలపాలి. ఇక అంతే కొత్తిమీర టమాట పచ్చడి రెడీ అయిపోతుంది.వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకుని, పక్కనా ఒక ఆమ్లెట్ వేసుకుని తింటుంటే రుచి అదిరిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్య మీరు కూడా ఈ కొత్తిమీర టమాట పచ్చడి చేసుకొని దీన్ని రుచి అస్వాదించండి.ఈ పచ్చడి తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: