మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గే టిప్స్?

Purushottham Vinay
మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం. కానీ ఈమధ్యకాలంలో మనలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో ఎంతగానో బాధపడుతున్నారు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం అసలు అంత మంచిది కాదు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. గుండెపోటు, హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత సమస్యలు ఇలా చాలా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఒక్కోసారి శరీరంలో అధికంగా ఉండే ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల మనం ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది.అందుకే ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడాలి. ఈ సమస్య నుండి బయట పడాలంటే మన జీవన విధానంతో పాటు మన ఆహారపు అలవాట్లల్లో కూడా ఖచ్చితంగా మార్పు చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మనకు అవకాడోలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తో పాటు ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను కరిగించడంలో బాగా సహాయపడుతుంది.


ఇంకా అలాగే చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు ఓట్స్ ను కూడా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే శరీరంలో అధికంగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో బార్లీ గింజలు కూడా సహాయపడతాయి.ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.ఇంకా అలాగే నిమ్మజాతికి చెందిన పండ్లను కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సహాయపడతాయి. ఇంకా అలాగే కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు డార్క్ చాక్లెట్ ను ఎక్కువగా తీసుకోవాలి.వీటిలో ఉండే ప్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడతాయి. ఇక కొలెస్ట్రాల్ ను తొలగించడంలో వెల్లుల్లి మనకు చాలా సహాయపడుతుంది. వంటల్లో వాడడం వల్ల లేదా నేరుగా దీనిని తినడం వల్ల మనం చాలా సులభంగా కొలెస్ట్రాల్ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చెడు కొలెస్ట్రాల్ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: