ఆ ఇద్దరు హీరోల నుండి సూర్యకు ప్రమాదం పొంచి ఉందా..?

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య ప్రస్తుతం కంగువా అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దిశా పటాని ఈ మూవీ లో సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు బాగానే ఉంది కానీ ఇదే తేదీన ఈ సినిమాను విడుదల చేసినట్లు అయితే ఓ వైపు బాలకృష్ణ మరో వైపు రామ్ చరణ్ నుండి సూర్య కు ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.

ఎందుకు అంటే నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా పూర్తి అయినట్లు అయితే ఈ సినిమాను కూడా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఓ వైపు బాలయ్య , మరో వైపు రామ్ చరణ్ ఇద్దరు కూడా అక్టోబర్ నెల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ సినిమాలలో ఏ సినిమా అక్టోబర్ నెలలో విడుదల అయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కంగువా మూవీ కి కలెక్షన్ లు భారీ స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: