కండ్ల కలక ఎందుకు వస్తుందో తెలుసా..?
వర్షాలు ఎక్కువ పడే సమయంలోనే ఇలా కంటి ఇన్ఫెక్షన్లు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయట. వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ కండ్ల కలక ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందట. ముఖ్యంగా స్కూల్స్ లలో ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందట.ముఖ్యంగా అలర్జీ వల్ల కలిగేది అన్నట్లుగా వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఇది ఆరోగ్య యొక్క నిరోధక వ్యవస్థ మీద కూడా ఆధారపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ బ్యాక్టీరియాల వల్ల కొద్ది రోజులపాటు కన్నుమీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందట దీనివల్ల చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కళ్ళు నడపడం లేదా కంట్లో చేతులు పెట్టడం వంటివి అసలు చేయకూడదు శుభ్రమైన టిష్యూ లేదా కర్చీప్ వంటివి వాడడం చాలా మంచిది.. ముఖ్యంగా నల్ల అద్దాలు పెట్టుకోవడం వల్ల ఈ లక్షణాల నుంచి కొంత సమయం ఉపశమనం కలుగుతుందట.. అయితే ఇది వచ్చిన రెండు వారాలలో పూర్తిగా నయమవుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ బ్యాక్టీరియా వల్ల కలిగిన సమస్య అయితే ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి మందు తగిన మోతాదులలో వాడడం మంచిది. అయితే ఇలాంటివి వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే తరచూ చేతులను శుభ్రంగా చేసుకోవాలి ఎక్కువగా కళ్ళను ముట్టుకోకూడదు కళ్లద్దాలు వాడడం వల్ల కూడా తగ్గిపోతుంది.