లైఫ్ స్టైల్: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
డయేరియా:
సాధారణంగా వర్షాకాలంలో అపరిశుభ్రంగా ఉండే ఆహారాలను కలుషితమైన నీటిని తీసుకుంటే డయేరియా వస్తుంది. ముఖ్యంగా దీనివల్ల విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అందుకే ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినేయాలి ముఖ్యంగా ఆహారం వండేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్, చిరుతిళ్ళు మానేసి వీలైనంతవరకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.
డెంగ్యూ: దోమలు కుట్టడం వల్ల ఇది వస్తుంది కాబట్టి మన ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.అలాగే ఇంట్లో దోమ తెరలను ఉపయోగించాలి. దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ , క్రీములు వంటివి ఉపయోగిస్తే డెంగ్యూ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఇక తరచూ వచ్చే జలుబు, ఫ్లూ వంటివి కూడా రాకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇతరులకు జలుబు, ఫ్లూ జ్వరాన్ని వ్యాపింప చేస్తుంది. కాబట్టి మీకు అలా వచ్చినప్పుడు లేదా ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దూరంగా ఉండాలి ఇతరులు వాడే ఏ వస్తువులు కూడా ఉపయోగించకూడదు అలాగే ఈ వ్యాధులు ఉన్నవారు దగ్గినా , తుమ్మినా సరే ముక్కుకు అడ్డంగా చేయి లేదా ఖర్చీఫ్ అడ్డంగా పెట్టుకోవాలి.ఇలా చేస్తే వీటిని దూరం చేసుకోవచ్చు.