ఇలాంటి వ్యాధులతో బాధపడేవారు.. మామిడి పండ్లు అస్సలు తినకూడదు..!
వీరేచనాలు..
కొంతమందికి ఏమి తిన్న తొందరగా విరేచనాలు అవుతుంటాయి.అలాంటివారు మామిడి పండ్లను అసలు తినకూడదు.ఎందుకంటే మామిడి పండ్లను అధికంగా తీసుకుంటే డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.మామిడిలో ఉన్న పీచు ఎక్కువగా తీసుకోవడం వల్ల,అధిక విరేచనాలు కలిగే ప్రమాదం ఉంది.కనుక ఇలాంటి వ్యాధి కలవారు మామిడి పండ్లు తీసుకోకుండా ఉండడం ఉత్తమం.
అలర్జీ..
కొంతమందికి మామిడిపండు తింటే అలర్జీ కావచ్చు.కళ్ల నుండి నీరు కారడం,ముక్కులో నీరు కారడం,పొట్ట నొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.కనుక అలర్జీ సమస్యలు కలవారు,మామిడిపండును అస్సలు తీసుకోకూడదు.
చర్మ సమస్యలు..
మామిడి పండ్లను తీసుకోవడం వల్ల,కొంతమందిలో చర్మ సంబంధిత సమస్యలు వస్తుంటాయి.నిజానికి మామిడిలో ఉరుషియోల్ అనే కెమికల్ ఉంటుంది.ఇది చర్మానికి అంటుకున్నప్పుడు,చిన్నచిన్న దద్దుర్లు, పొక్కులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు మామిడిపండ్లు అధికంగా తినడం వల్ల,అవి శరీరానికి వేడిని అందించి,చెమట పొక్కులు వచ్చేందుకు దోహదపడతాయి.కావున ఇటువంటి వారు మామిడి పండ్లను తినకపోవడం మంచిది.
మధుమేహం..
మధుమేహం కలవారు అధికంగా మామిడి పండ్లు తీసుకోవడం వల్ల,అందులోనీ సహజ చక్కరలు వారి రక్తంలో తొందరగా కలిసిపోయి,వారి రోగాన్ని తీవ్రతరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కనుక వారు మామిడి పండ్లను తీసుకునేటప్పుడు వైద్యుని సలహా పాటించడం ఉత్తమం.
పైన చెప్పిన రోగాలతో బాధపడేవారే కాక,సాధారణంగా ఉన్న మనుషులు కూడా మామిడిపండును తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం.దానికి కారణం వేసవిలో వీటిని సరఫరా చేయాలనే మిషతో కాల్షియం కార్బోనేడ్ అధికంగా ఉపయోగించి పండిస్తూ ఉంటారు. రసాయనాలు ఉన్న పండ్లను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.