మొలల వ్యాధితో బాధపడే వారికి అరటి పండు బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే చక్కెరలు మొలల వ్యాధిని తగ్గించడంలో సహాయపడతాయి. అరటి పండులో ఉండే యాంటీ బయాటిక్ గుణాలు నొప్పి ఉన్న ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.మొలల వ్యాధితో బాధపడే వారు రోజూ రెండు బాగా పండిన అరటి పండ్లను తింటే చక్కటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మొలల సమస్యను తగ్గించడంలో ముల్లంగి రసం అద్భుతంగా పని చేస్తుంది. రోజూ ముల్లంగి రసం తీసుకోవడం వల్ల మొలల వ్యాధి నుండి బయటపడవచ్చు. అలాగే రోజు మొత్తంలో 3 నుండి 4 లీటర్ల నీటిని తాగాలి. నీరు శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల మొలల వ్యాధి నుండి ఉపశమనాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో పసుపు ఒకటి. రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. ఈ నీటిని పరగడుపున తాగడం వల్ల మొలల సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. పసుపులో ఉండే యాంటి ఇన్ ప్లామేటరీ గుణాలు నొప్పిని, వాపును తగ్గించి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
మొలలను నివారించడంలో అంజీరా పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం మొలలను నివారించడంలో దోహదపడతాయి. రోజూ రాత్రి అంజీరా పండును నీటిలో నానబెట్టి ఉదయాన్నే నీటితో పాటు అంజీరా పండును తీసుకుంటే మొలల సమస్య తగ్గుతుంది. అదే విధంగా నల్ల జీలకర్రకు కూడా ఫైల్స్ ను తగ్గించే గుణం ఉంది. ప్రతిరోజూ ఒక స్పూన్ నల్లజీలకర్రను నీళ్లల్లో వేసి బాగా మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజూ తాగడం వల్ల మొలల సమస్య తగ్గు ముఖం పడుతుంది.మలవిసర్జన సాఫీగా లేనివారు నారింజ పండ్లను, నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఆలివ్ నూనెను కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మలబద్దకం సమస్య శాశ్వతంగా నివారించబడుతుంది. అదే విధంగా మొలల వ్యాధితో బాధపడే వారు కొన్ని ఐస్ క్యూబ్స్ ను వస్త్రంలో ఉంచి మూటలా కట్టాలి. వీటిని మొలలపై రాస్తూ మర్దనా చేయాలి.ఇలా చేయడం వల్ల వాపు తగ్గి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.