లైఫ్ స్టైల్: తడిగా ఉన్నటువంటి దుస్తులను వాడుతున్నారా.. అయితే ఇక అంతే..!!
ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఉంటారు..కానీ చేజేతులా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని కొన్ని సందర్భాలను బట్టి మనకు తెలుస్తుంది..సామాన్యంగా ప్రతి ఒక్కరు చేసేటువంటి తప్పులలో లో దుస్తులు ఒకటి అని చెప్పవచ్చు. వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వారని కూడా చెప్పవచ్చు. అయితే లో దుస్తుల పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోక తప్పదని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంతకీ లో దుస్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం.
ఇన్నర్ వేర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అటు మహిళలతో పాటు, పురుషుల కు కూడా.. ప్రై*టు పార్టు అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక అంతేకాకుండా లో దుస్తులు తడిగా ఉన్నప్పుడు ఉపయోగించినట్లు అయితే వాటి వల్ల ఫంగస్, అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా ఎరుపు దద్దుల్లు, చికాకు గా రావడం వల్ల ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఇక ఎక్కువసేపు జాగింగ్, వర్కౌట్ చేస్తున్నవారు వెంటనే లోదుస్తుల ను మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వర్కౌట్ వల్ల సహజంగానే ప్రైవేట్ పార్ట్ భాగంలో ఎక్కువగా చెమట వస్తుంది. అలాగే వదిలేస్తే అది అంటువ్యాధిగా మారే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఎక్కువ చెమటతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఒకటి కంటే ఎక్కువసార్లు లో దుస్తులను మారుస్తూ ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుచేతనే లో దుస్తులు తడిగా లేకుండా బాగా ఎండకి ఆరబెట్టిన వాటిని వేసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలు వహిస్తూ లో దుస్తులను ధరిస్తూ ఉండాలి