లైఫ్ స్టైల్: మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే..!!

Divya
సాధారణంగా వైద్య రంగంలో దీనిని అల్జీమర్స్ అని అంటారు. మన భాషలో చెప్పాలంటే మతిమరుపు అని చెప్పవచ్చు. ఇకపోతే కొన్ని సంవత్సరాలుగా వృద్ధులలో అల్జీమర్స్ సమస్య పెరుగుతోందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీంతో వృద్ధులు నిత్యజీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బలహీనమైన జ్ఞాపకశక్తి కారణంగా ప్రతి విషయాన్ని కూడా వీరు మరిచిపోవడంతో కుటుంబంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు మతిమరుపు కారణంగా కుటుంబ సభ్యుల చేత చివాట్లు పడడం లేదా గొడవలు ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణంగా ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాల వయసు పైబడిన వారిలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు.

మరీ ముఖ్యంగా అల్జీమర్స్ సమస్యను తగ్గించవచ్చు కానీ పూర్తిగా నయం చేయలేమని చెబుతున్నారు నిపుణులు. ఇకపోతే మానసిక ఒత్తిడి,  సరైన సమయానికి నిద్రపోకపోవడం,  ధూమపానం,  మద్యపానం,  పోషకాహారం లేని తిండి తినడం లాంటి వాటి వల్ల అల్జీమర్స్ కి గురి అవుతున్నారు. ఇక మీరు ప్రతిరోజు ఈ సమస్యకు గురికాకుండా ఉండాలి అంటే యోగ ,మెడిటేషన్ చేయాలి అని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆహారంలో ప్రతిరోజు చేపలు , కూరగాయలు,  పండ్లు,  నట్స్ ఉండేలాగా చూసుకోవాలి అని,  ఇవి మీ మతిమరుపు సమస్యను దూరం చేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయని వారు తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా మద్యపానం,  ధూమపానం చేసే వ్యక్తులలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది అని , ఆల్కహాల్ పూర్తిగా మానేస్తే అల్జీమర్స్ సమస్య కూడా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
ఇక అంతే కాదు జన్యుపరమైన కారణాల వల్ల కూడా కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇతర సభ్యులకు కూడా వచ్చే అవకాశం ఉందట. ఆల్జీమర్స్ సమస్య వచ్చినప్పుడు మతిమరుపు , ఆ నిశ్చితత్వం,  అయోమయం , దృష్టి కోల్పోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: