లైఫ్ స్టైల్: ఈ జ్యూస్ తో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చా..?

Divya
ఇటీవల కాలంలో తినే ఆహారంలో మార్పుల కారణంగా అధిక బరువుకు గురి అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది బరువు పెరుగుతూ ఎన్నో అవస్థలను పడుతున్నారు. ముఖ్యంగా ఆడవారు సమయానికి భోజనం చేయకపోగా అనవసరమైన ఆహారం తీసుకుంటూ తమ ఆరోగ్య విషయంపై శ్రద్ధ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా బరువు పెరిగిపోతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది ఎక్సర్సైజ్ , వ్యాయామం,  యోగ,  డైట్ లాంటివి చేసి బరువు తగ్గించుకుంటే మరి కొంతమంది ఏం చేసినా సరే బరువు తగ్గించుకోలేకపోతుంటారు.
ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇకపోతే ఉద్యోగాలకు వెళ్లే వారిలో కూడా ముఖ్యంగా ఎక్కువగా కూర్చుని పని చేసే వాళ్ళలో కూడా ఇలాంటి అధిక బరువు సమస్య కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా అధిక బరువుతో ఇబ్బంది పడటం వల్లనే చేయలేక శరీరంలోని అవయవాలు కూడా పనిచేయవు. మరి అధిక బరువును తగ్గించుకోవాలన్నా.. ఆరోగ్యం మెరుగుపడాలన్నా సరే సరైన ఆహారం తీసుకుంటూ బరువును తగ్గించుకోవచ్చు. ఇకపోతే అధిక బరువును తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే ఒక జ్యూస్ చాలా చక్కగా సహాయపడుతుందని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు.
అదేమిటంటే క్యారెట్, బీట్రూట్, ఆపిల్.. ఈ మూడింటితో కలిపిన జ్యూస్ ను ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఇక అలాగే జీవనశైలిలో తప్పకుండా మార్పులు తీసుకోవాలి. సరైన ఆహారం నియమాలను పాటిస్తూ ఫాస్ట్ ఫుడ్, అధికంగా మాంసం తీసుకోవడం , కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, తీపి పదార్థాలు లాంటి వాటిని కూడా కొద్ది రోజులు దూరంగా ఉంచితే ఆరోగ్యకరంగా మీరు మీ బరువును తగ్గించుకోవచ్చు. ఒకేసారి మొత్తం ఆహారం తీసుకోకుండా రోజుకు నాలుగు సార్లు ఆహారం కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: