లైఫ్ స్టైల్: జ్వరాన్ని తగ్గించే అద్భుతమైన మెడిసిన్..!!

Divya
అసలే వర్షాకాలం. ఇక ఈ కాలం ఎక్కువగా  జలుబు,  దగ్గు,  జ్వరం వంటివి వస్తూ ఉంటాయి. ఇక చాలామంది వాటి నుంచి తట్టుకోలేక మందులు,  మెడిసిన్లు వాడుతూ మరింత అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇకపోతే మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి వైరల్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో లభించే వస్తువులతోనే ఉపశమనం పొందవచ్చు అని ఆయుర్వేద నిపుణులు కూడా తెలియచేస్తున్నారు. ఇక ఇంట్లో లభించే మసాలా దినుసులతో కూడా వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం పొందవచ్చట. మరి ఆ మసాలా దినుసులు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
మసాలా దినుసులలో ముఖ్యంగా అందరికీ గుర్తుకొచ్చేది పసుపు .. యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఎటువంటి సీజనల్ వ్యాధులు అయినా సరే తగ్గిపోతాయి. ఇక అలాగే శొంఠి కూడా వ్యాధుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. మీలో ఎవరైనా సరే దగ్గు , జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లయితే శొంఠి తో తయారుచేసిన టీ లేదా పాలను తాగినట్లయితే త్వరగా ఉపశమనం కలుగుతుంది లేదా పాలల్లో పసుపు వేసుకొని తాగినా సరే మరింత ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక కొత్తిమీర కూడా వైరల్ ఫీవర్ ను  ప్రభావితంగా తగ్గిస్తుందని సమాచారం.
ఇక ఇందులో ఉండే గుణాలు శరీరానికి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అలాగే వైరల్ ఫీవర్ ను క్షణాల్లో తగ్గిస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఇకపోతే మరిగించిన తులసి ఆకుల నీటితో కూడా వ్యాధుల సంక్రమణ నివారించవచ్చు. ఇక లవంగాల పొడి,  తులసి ఆకులను ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి గంటకొకసారి తాగినట్లయితే వైరల్ ఫీవర్ నుంచి గంటలోనే ఉపశమనం కలుగుతుంది. త్వరగా జీర్ణం అయ్యే.. ఇడ్లీ, దోస లాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోనే వైరల్ ఫీవర్ ని నయం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: