లైఫ్ స్టైల్: వంటింటి పసుపుతో ఈ వ్యాధులకు చెక్..!

Divya
భారతీయ వంటశాలలో పసుపుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా పసుపు అనేది వంటకు మంచి రుచిని అందివ్వడమే కాకుండా అద్భుతమైన రంగును కూడా అందిస్తుంది .ఇకపోతే పసుపు కేవలం వంటలలో మాత్రమే ఉపయోగించకుండా ఆరోగ్యపరంగా.. సౌందర్య పరంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న పనులకే తొందరగా అలసిపోతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొంది తక్షణమే శక్తి రావాలి అంటే టీ , కాఫీలకు బదులుగా వేడి నీటిలో పసుపు వేసుకుని తాగితే శక్తి లభిస్తుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా పసుపు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. పసుపును ఆయుర్వేద ఔషధాలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. శరీరానికి వచ్చే అన్ని వ్యాధుల నుంచి మనకు రక్షణ కలిగిస్తుంది .చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ఇకపోతే పసుపును చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ముఖం మీద ఉండే అవాంచిత రోమాలు తొలగిపోవాలి అంటే నిత్యం పసుపుతో ముఖం శుభ్రం చేసుకుంటే ఇట్టే తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతులీనుతుంది. ఇక చర్మం మీద ఏవైనా గాయాలు, ఇన్ఫెక్షన్లు, దెబ్బలు తాకినప్పుడు పసుపు రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. పసుపు ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది కాబట్టి చర్మం పైన ఏవైనా వైరస్లు ,ఇన్ఫెక్షన్లు ,బ్యాక్టీరియా ఉంటే వెంటనే వాటితో పోరాడి సమస్యలను నయం చేస్తుంది.

జలుబు,  దగ్గు ఉన్నప్పుడు ప్రతి రోజు రాత్రి గోరు వెచ్చని పాలలో కాస్త పసుపు వేసుకొని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. అరికాళ్ళు మంటలు పుడుతూ ఉంటే గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి అరగంట పాటు పాదాలు ఆ నీటిలో ఉంచితే మంచి నిద్ర కూడా వస్తుంది. ఇక చెప్పుకుంటూ పోతే మరెన్నో ప్రయోజనాలను మనం పసుపు ద్వారా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: