"కొత్త సంవత్సరం" ఇలా ఉండడం బెస్ట్...

VAMSI
ప్రతి రోజూ ఒకలా ఉండదు.. ప్రతి మనిషి ఒకలా ఆలోచించడు... మనిషి ఎప్పుడూ ఒక్కడే విధమైన భావాలను ఆకలిగి ఉండదు. ఇవి ఎవ్వరూ కాదనలేని అక్షర సత్యాలు. ఇవాళ మనం అంతా నూతన సంవత్సరం 2022 లోకి అడుగు పెట్టాము. ప్రతి సరి కూడా 365 రోజుల తర్వాత సంవత్సరం మారడం మనము చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన మరియు మనల్ని మనము మార్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కనుక వీటన్నిటినీ మనము మార్చుకోగలిగితే లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది. అయితే అవేమిటో ఒకసారి చూద్దామా.
* ముందుగా రేపు ఏమి జరుగుతుంది అనే విషయం పట్ల అందరీకే ఉత్సుకత ఉండడం సహజమే. కానీ రేపటి గురించి ఆలోచిస్తే ఈ క్షణం మీరు అందాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచించండి.
* మనము ఈ సమాజంలో అతి తక్కువ మందితో మాత్రం ఎక్కువ కాలం కనెక్షన్ పెట్టుకుంటాము, వారిలో మనము, మన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు కొలీగ్స్ ఇంకా మొదలైనవారు. వీరితో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా   వారు ఎలాంటి వారైనా హ్యాపీగా ఉండండి, వారితో కలిసి ఉండండి, మీ సంతోషాలు బాధలు వారితో పంచుకోండి.
* ఇప్పుడు ప్రస్తుతం అందరి మనసులో మెదులుతున్న ఒకే ఒక సమస్య కరోనా వైరస్. దీని గురించి మాత్రమే క్షణక్షణం భయపడుతున్నారు. మనము పాటించాల్సిన జాగ్రత్తలు సరిగా పాటిస్తే కరోనా మన దరికి చేరదు.
* ఎంతటి నెగిటివ్ విషయాన్ని అయినా పాజిటివ్ గా తీసుకోవడం అలవాటు చేసుకోండి.
* రాబోయే కాలంలో ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ రోజువారీ ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి. ఒక ప్రణాళిక ప్రకారం మీ ఖర్చులు చూసుకోండి.
* ఆరోగ్యకరమయిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కు దూరం కావడం మంచిది.
* స్వార్ధాన్ని, చెడు లక్షణాలను, మనిషిని బాధపెట్టే ఏ పనినీ మీరు చేయకండి.
ఇలా పైన తెలిపిన ప్రతి ఒక్క విషయాన్ని సీరియస్ గా తీసుకుని అనుసరిస్తే మీరు ఉత్తమ వ్యక్తిగా సంతోషంగా ఉంటారు. మరొక్కసారి "విష్ యు ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్".    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: