లైఫ్ స్టైల్: డయాబెటిస్ వారు వీటిని తినవచ్చా..?
ఇకపోతే 2019 వ సంవత్సరం లో జరిపిన అధ్యయనం ప్రకారం 69 శాతం మంది భారతీయులు ప్లాంట్ బేస్డ్ లో ఆప్షన్ కోసం మాంసాహారాన్ని కూడా పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇకపోతే టైప్ 1 , టైప్2 డయాబెటిస్ తో బాధపడుతున్నవారు వేగన్ లేదా వెజిటేరియన్ డైట్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి డైట్ ను డయాబెటిస్ వారు మేనేజ్ చేయడం చాలా తేలిక. వెజిటేరియన్ డైట్ లో డయాబెటిస్ ఉన్నవారు పాలు, తేనె ,పాల పదార్థాలను తీసుకోవటం.. వేగన్ డైట్లో అయితే ఇవి కూడా ఉండవు.. అంటే వేగన్ డైట్ లో ఫిష్, మీట్, పౌల్ట్రీ, ఎగ్స్, పాలు, తేనె , పెరుగు , పన్నీర్, మజ్జిగ, బటర్ వంటివి ఏవీ కూడా ఉండవు..
అందుకే డయాబెటిస్ ఉన్నవారు వేగన్ డైట్ ను ప్రిఫర్ చేయడం వల్ల కూరగాయలు, సీడ్స్, పండ్లు, పప్పు ధాన్యాలు ,ఆకు కూరలు తినడం చాలా మంచిది. ఇక లావుగా , అధిక బరువుతో డయాబెటిస్ వారు బాధపడుతున్నట్లు అయితే ఇలాంటి డైట్ ను ఫాలో అవడం వల్ల సమస్య కంట్రోల్ లో ఉండడంతో పాటు మరికొన్ని రోజులు ఎక్కువ జీవిస్తారు అని వైద్యులు తెలిపారు.