లైఫ్ స్టైల్ : నెయ్యి తింటే హార్ట్ ఎటాక్ వస్తుందా..?

Divya
సాధారణంగా మన భారత దేశంలో చాలామంది నెయ్యి లేనిదే ముద్ద దిగదు అని అంటారు. కొంతమంది నెయ్యి తింటే అధిక బరువు పెరుగుతామనో..? లేదా గుండెకు కొవ్వు చేరుకుంటుందేమో..? అనే అపోహలతో నెయ్యి తినడానికి భయపడుతూ ఉంటారు. ఇక నిజంగా నెయ్యి తింటే గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోతుందా..? లేదా గుండె జబ్బులు వస్తాయా..? అనే అపోహలు చాలామందిలో ఉంటాయి.. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..
సాధారణంగా ప్రతి ఒక్కరూ నెయ్యిని తినడం అలవాటు చేసుకున్నారు.. కాబట్టి నెయ్యి తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందట. అంతేకాదు గుండె జబ్బులు త్వరగా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యి తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ, మనిషి శరీర తత్వాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది అని ప్రతి ఒక్కరికీ తెలుసుకోవాలి. మనిషి యొక్క ఆరోగ్యాన్ని బట్టి సమస్యలు కూడా మారుతాయి అనే విషయాన్ని గమనించుకోవాలి.
అయితే నెయ్యి వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. నెయ్యి తీసుకోవడం వల్ల మనలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. రోజువారి తీసుకెళ్లే కార్బోహైడ్రేట్స్ తో పోలిస్తే ఇది చాలా ఉత్తమమైనవి. భారతీయ వంటలు తయారు చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలం నుండి తీపి పదార్థాలు మొదలుకొని ప్రతిపదార్థం లోను తప్పనిసరిగా వాడేవారు.. ఇక ఈ మధ్య కాలంలో కూడా పప్పు  ఇలాంటి ఆహార పదార్థాలు తినేటప్పుడు నెయ్యి వేసుకొని కచ్చితంగా తినడం అలవాటుగా మారిపోయింది. శీతాకాలంలో నెయ్యి ఎక్కువగా తినడం వల్ల చలి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అంతేకాదు జీర్ణక్రియ క్రమబద్దం చేయడానికి కూడా మనకు బాగా సహాయపడుతుంది. కొంతమంది శరీరతత్వాన్ని బట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: