మీరు అన్నం వండేముందు బియ్యాన్ని కడుగుతారు కదా.. అలా కడిగిన నీటిని పారబోస్తున్నారా.. అయితే మీరు పొరపాటు చేసినట్లే. ఎందుకంటే ఆ బియ్యపు నీటిలో ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయన్న విషయం మీరు గ్రహించాలి. బియ్యం కడిగిన నీటితో మీ జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు తెలుసా..ఆ టిప్స్ ఏంటో ఒకసారి చుడండి.. ఒక అర కప్పు ఆర్గానిక్ బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ తీసుకొని బాగా కడగాలి. శుభ్రపరిచిన బియ్యాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని, 2 కప్పుల నీటిలో సుమారు రెండు గంటల పాటు నానబెట్టండి. ఇప్పుడు బియ్యాన్ని వడకట్టి, గాలి చొరబడని డబ్బాలో లేదా సీసాలో బియ్యం నీటిని నిల్వ చేయండి.
ఆ బియ్యం నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. దీన్ని స్ప్రే బాటిల్ లో పోసి, దానిలో ఒక టీస్పూన్ ఆముదంను కూడా కలపండి. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తల మీద స్ప్రే చేసి, మసాజ్ చేయండి. మంచి ఫలితాల కోసం రాత్రంతా వదిలేయండి.అయితే మీకు ఏదైనా ఫలితం కనిపించాలంటే మీరు రెగ్యులర్‌గా దీన్ని అప్లై చేయాలి.బియ్యం నీరు మీ తలని లోతుగా శుభ్రపరుస్తుంది. జిడ్డు లేకుండా చేస్తుంది. అంతే కాదు, పొడి, చిక్కు పడే జుట్టు ఉన్నవారికి ఇది గొప్ప కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది జుట్లు చిట్లడాన్ని కూడా తగ్గిస్తుంది. బియ్యం నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా సిల్కీగా కూడా చేస్తుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఒక్క బియ్యం నీటితో అటు మీ చర్మాన్ని, ఇటు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి బియ్యం నీటిని రెగ్యులర్ గా ఉపయోగించండి.బియ్యం నీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల బియ్యం నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా, సిల్కీగా తయారవుతుంది. బియ్యం నీరు చుండ్రును కూడా తగ్గిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. బియ్యం నీటిలో పొటాషియం, అయోడిన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, మాంగనీస్, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. అంతే కాదు బియ్యం నీటితో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. బియ్యం నీరు ముఖ రంధ్రాలను తగ్గించి మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఈ బియ్యం నీటిని క్రమం తప్పకుండా వాడితే ప్రకాశవంతమైన, మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. మొటిమల నివారణకు కూడా బియ్యపు నీటిని వాడవచ్చు. చూసారు కదా బియ్యం కడిగిన నీటితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. మరి ఇక మీదట అయిన ఆ నీటిని పారబొయ్యకుండా ఉపయోగించుకోండి