పెళ్లి కూతురుకు మెట్టెలు ఎందుకు తొడుగుతారో తెలుసా..

Satvika
పెళ్ళైన మహిళలు కాలికి మెట్టెలు, నుదుట తిలకం, మెడలో తాళి, జడలో పూలు పెట్టుకోవడం మన సాంప్రదాయం, అయితే  చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి.అసలు మెట్టెలు కాలికి ఎందుకు తొడుగుతారు ఇలాంటి చాలా సందేహాలు అందరికీ వస్తుంటాయి. వీటి వెనుక పెద్ద రహస్యం ఉందని తెలుస్తోంది. గొప్ప చరిత్ర ఉందని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి చూడండి..

హిందూ సంప్రదాయంలో ప్రతి పనికి ఒక్క రహస్యం ఉంటుంది. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకూ ఆయువు పట్టు వంటిది. దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంటుంది. కనుక ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని. అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం వచ్చింది.అయితే కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుంది. కాలికి మెట్టెలు ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట.

వారి రుతు క్రమం సరిగ్గా ఉంటుందట. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది.ఇక వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట. మెట్టెలు వెండితో చేసినవి ధరిస్తారు.. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల..భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది.. అందుకే భారతీయ స్త్రీలు కాలి రెండోవ వేలుకు వెండి, రాగి మెట్టెలు ధరిస్తారు. స్త్రీలు వారి చేతికి వేసుకొనే గాజులు, కాళీ మెట్టలు రెండు కూడా సంతానాబివృద్ధికి, సుఖ ప్రసవం అవడానికి అనుకూలించే నాడులను సున్నితంగా నొక్కుతు ఉంటాయి. అందువల్ల మన పూర్వికులు వధువుకి కాళ్ల మెట్టలు ధరించడం సంప్రదాయంగా చేర్చారు. ఈ మెట్టలు వధువుకి వివాహిత అని చెప్పే మరో గుర్తు. వివాహతంతులో వధువు పాదాన్ని రోకలిపై ఉంచి వరుడు వధువు కాలి వేలుకి తోడుగుతాడు... ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా సంప్రదాయాలు ఉంటాయి.. అది మెట్టెలకు ఉన్న అసలు కథ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: