వైరల్ వీడియో : కరోనా భాదితుల్ని కాల్చి చంపేస్తున్నారు..???

NCR

కరోనా పేరు చెప్తేనే ప్రపంచ దేశాలన్నీ కంగారు పడిపోతున్నాయి. ఎక్కడ తమ దేశంలోకి ఈ మహమ్మారి వైరస్ వచ్చి పడుతుందో అంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నా సరే కరోనా ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రభాలుతూనే ఉంది. ఇప్పటికి ఈ వైరస్ భారిన పడి సుమారు 1400 మందికి పైగానే మృత్యు వాత పడగా...వేలాది మందికి ఈ వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. సుమారు 20 దేశాలకి పాకిన ఈ వైరస్ వలన ఇంకెలాంటి ఘోరాలు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు ప్రజలు...అయితే

 

ఈ వైరస్ సోనిక వారిని చైనా చంపేస్తోంది అనే వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అందుకు నిదర్శనం ఇదేనంటూ చైనా పోలీసులు భాదితులని చంపుతున్నారు అనే వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చెక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నార్త్ కొరియాలో ఓ అనుమానిత కోరోనా భాదితుడిని కాల్చి చంపిన విషయం విధితమే. అయితే చైనా కూడా అదే బాటలో వెళ్తోందని అందుకు సాక్ష్యం ఈ వీడియో అంటూ ట్విట్టర్ లో పోస్ట్ అయ్యింది. ఈ వీడియోలో చైనా పోలీసు అధికారులు మాస్క్ లు ధరించి రోగులని కాల్చి చంపుతున్నట్టుగా ఉంది.

ఈ వీడియో ని చైనా కి చెందినా రిలయబుల్ అనే సంస్థ విడుదల చేసింది. దాంతో క్షణాలలో ఈ వీడియో కాస్తా వైరల్ అవడంతో చైనా ప్రజలు కంగారు పడిపోయారు. దాంతో ఈ వీడియో ఫేక్ అని, గతంలో ఎవో సంఘటనలని కలిపి ఈ వీడియో తయారు చేశారని, వీటిని ఎవరూ నమ్మవద్దంటూ అధికారులు ప్రకటించారు.అయితే ప్రస్తుతం ఈ వీడియో కొట్లలో వ్యూస్ పొంది సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: