బుడుగు: పిల్లలకు ఇప్పుడే పళ్లు వస్తున్నాయా ఇవి పెట్టండి..??
పిల్లలకు క్యారెట్ నమలడం ద్వారా పళ్లకు మంచిదంట. క్యారెట్ అదనంగా తీపిగా రుచిగా ఉండటమే కాక.. పిల్లలకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని అన్నారు. అలాగే బీట్‌రూట్‌ను సన్నగా కట్ చేసి దీన్ని నమలడం ద్వారా చిగుళ్లు దృఢంగా ఉంటాయని అన్నారు. అంతేకాదు.. బీట్‌రూట్ ప్లిలల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పిల్లలకు చీజ్ ముక్కను ఇవ్వడం వలన చిగుళ్లనొప్పిని తగ్గిస్తుందని వైద్యులు చెప్పారు. ఇక చీజ్ నమిలినా.. తిన్నా.. కూడా మంచిదేనని అన్నారు.
అంతేకాక..ఉడకబెట్టిన పప్పులు పిల్లల దంతాలను వేగంగా పెరగటానికి దోహదపడుతుంది. ఇక చిగుళ్లలో పుండ్లు, వాపు తగ్గిస్తాయని అన్నారు. పిల్లలకు అరటిపండు ఇవ్వడం వలన అందులోని కాల్షియం పుష్కలంగా ఉండటంతో.. సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అరటి రుచిలో దాగి ఉంటాయన్నారు. ఇవి దంతాల పెరుగుదలకు సహకరిస్తాయని పేర్కొన్నారు.
అంతేకాదు.. దానిమ్మతో హిమోగ్లోబిన్ స్థాయి అధికంగా ఉంటుందని అన్నారు. ఇక దానితో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపారు. దీనిని పిల్లలకు ఇవ్వడం వలన శిశువు పళ్లు, చిగుళ్లకు కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అంతేకాక.. యాపిల్ గురించి చెప్పాల్సిన పనిలేదనే చెప్పాలి. ఇక ఇది అన్ని వయస్సు వారికి మంచిదని అంటుంటారు. అయితే యాపిల్‌లో అనేక రకాల పోషకాలు లబిస్తాయి. ఇక ఇవి చిగుళ్లకు చాలా మంచిదని పంటినొప్పి నివారిస్తుందని అన్నారు.