బుడుగు :పిల్లలు నిద్రలో లేచి ఏడవడానికి కారణం తెలుసా.. !!

Suma Kallamadi

తల్లిదండ్రులంతా.. చెప్పే కంప్లైంట్.. వాళ్ల బేబీ మధ్య రాత్రిలో నిద్రలేస్తున్నారని. రాత్రంతా పిల్లలను నిద్రపుచ్చడం చాలా కష్టమైన పని. అలాగే పిల్లలు రాత్రిపూట ఎందుకు నిద్రలేస్తున్నారనేది తెలుసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. చాలా సందర్భాల్లో ఆకలిగా, చల్లగా, వెచ్చగా ఉన్నప్పుడే ఏడుస్తారు.అయితే మొదటిసారి తల్లిదండ్రులు అయినప్పుడు.. పిల్లలు ఎందుకు ఏడుస్తారనేది తెలుసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. అది కూడా మధ్యరాత్రి ఏడ్చినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కంగారు పడతారు. ఒకవేళ పిల్లలు రాత్రిళ్లు ఎందుకు నిద్రలేస్తారనే దానికి ఖచ్చితమైన ఆన్సర్ దొరకదు.

 

పిల్లలకు చిన్న పొట్టలుంటాయి. వాళ్లు తిన్నా, తాగినా.. కొంచమే తీసుకుంటారు. దీంతో అది త్వరగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా తల్లిపాలు తాగే పిల్లలు ఎక్కువసార్లు రాత్రిపూట నిద్రలేస్తూ ఉంటారు. ఎందుకంటే.. తల్లిపాలు... చాలా త్వరగా జీర్ణమవుతాయి.చాలామంది పిల్లలు సైడ్ కి తిరిగి పడుకోవడాన్ని ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు వాళ్లు చాలా కదులుతూ ఉంటారు. దీనివల్ల అసౌకర్యంగా ఫీలై.. నిద్రలేస్తారు. అలాంటప్పుడు వాళ్లను వెనక్కి లాగి.. సైడ్ కి పడుకోపెట్టాలి.పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. ఒకవేళ మీ పిల్లలు చాలా చల్లగా ఫీలవుతున్నప్పుడు నిద్రలేచి ఏడుస్తారు. వేడిగా ఫీలయినప్పుడు కూడా.. అలానే చేస్తారు. కాబట్టి.. ఆ పరిస్థితిని గుర్తించి జాగ్రత్త పడాలి 

 

దానికి తగిన వాతావరణం కల్పించాలి.పిల్లల్లో ఫుడ్ డైజెషన్ సరిగా అవనప్పుడు.. కడుపులో నొప్పి వస్తుంది. దీనివల్ల అసౌకర్యంగా ఫీలై.. రాత్రి నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు.పిల్లలు నిద్రపోయే విధానం పెద్దలు నిద్రపోయే విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్లు కొన్ని గంటలు నిద్రపోవడం, లేవడం చేస్తూ ఉంటారు. వాళ్ల శరీరం కంటిన్యూగా 8 గంటలు నిద్రపోవడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి మధ్యలో లేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భాలను గుర్తించి.. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. మళ్లీ హ్యాపీగా నిద్రపోతారు.. మీ బుజ్జి పాపాయిలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: