దాదాపు 10 వేల సంవత్సరాలుగా మనిషికి నేస్తం గా ఉంటూ విశ్వాసం ప్రదర్శించే శునకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శునకానీ కి సంబంధించి 800 జాతులు కనిపిస్తాయి. శునకం సుమారు 12 సంవత్సరాలు జీవిస్తుంది. తోడేలు నుంచి పుట్టుకొచ్చిన శునకం మనిషిని అర్థం చేసుకొవడంలో మిగిలిన జంతువుల కన్నా బెటర్ అవడంతో పెంపక ప్రక్రియ మొదలైందని చెబుతారు. వాసన, వినికిడి శక్తి విషయంలో శునకాలు నెంబర్ వన్ గా ఉంటాయి. మనిషి గమనించే శక్తి కన్నా 100 మిలియన్ రేట్లు అధికంగా ఈ గ్రహణ శక్తి వీటిలో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక్క ముద్ద తిండి పెట్టడంతో శునకాలు మనుషులతో స్నేహం మొదలుపెడతాయి. అది వాటి జీవితాంతం వరకు గుర్తుంచుకుంటుంది. కాబట్టి వాటిని అత్యంత విశ్వసనీయ స్నేహితులుగా చెబుతున్నారు. మన దేశంలో వీటిని పెంచుకోవడం వరకే కానీ ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించవు. అయితే విదేశాల్లో మాత్రం డాగ్స్ కి చట్టాలు ఉంటాయి. వాటి ప్రకారం మనుషులు గీత దాటితే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. పలు దేశాల్లో శునకాల సంరక్షణ ఈ విషయంలో యజమానుల నిర్లక్ష్యాన్ని కోర్టులు ప్రశ్నిస్తాయి. వాటిని సరిగా చూడకపోతే పెద్దఎత్తున జరిమానాలు, శిక్షలు కూడా విధిస్తూ ఉంటాయి. శునకమే కదా అని దానికి భోజనం సమయానికి అందించకపోతే అది తప్పుగా అనుసరించ బడుతుంది. మనదేశంలో చాలామంది తమ కుటుంబ భద్రత కోసం ఇంట్లో పెంపుడు కుక్కలని పెంచుకుంటూ ఉంటారు. దీనికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. కానీ కొన్ని దేశాల్లో శూనకాన్ని పెంచడం అంత ఈజీ కాదు. శునకాల హక్కులకు సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో శునక సంబంధిత చట్టాలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానాలతో జైలుకు వెళ్ళవలసి ఉంటుంది. శునకం మాంసాహారి. కానీ మనం ఏం తింటే దానికి అదే పెడతాం. శాఖాహారం తింటున్నాం కదా అని దానిని కూడా శాఖాహార జీవిగా మార్చే ప్రయత్నం చేస్తే భారి జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ చట్టం బ్రిటన్ లో అమలు చేస్తున్నారు. సాధారణంగా శునకాలు బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టపడతాయి. ఉదయం యజమాని వాకింగ్ కి వెళ్తే తనతో పాటు వాక్ చేయడానికి అవి చాలా ఇష్టపడతాయి. ఓ శునకాన్ని రోజుకు మూడు సార్లు బయటకు తీసుకు వెళ్లాలని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఇటాలియన్ నగరం టూరిన్ లోని చట్టం ఏమిటంటే యజమాని తన శునకాన్ని రోజుకు కనీసం మూడుసార్లు నడకకు తీసుకువెళ్లాలి అలా చేయడంలో విఫలమైతే 500 యూరోల జరిమానా విధిస్తారు.