బృహ‌దీశ్వ‌ర ఆల‌యం చూత‌ము రారండి ..!

Divya
భారతదేశం అత్యంత ప్రాచీన కట్టడాలకు పుట్టినిల్లు. ముఖ్యంగా మన భారతదేశంలో దాదాపు మూడు వేల సంవత్సరాల కిందట నిర్మించబడ్డ దేవాలయాలు, వాటి రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు గా మిగిలిపోయాయి. ఇప్పటికే ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ పురాతన దేవాలయాల గురించి తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు కూడా చేశారు. కానీ ఈ దేవాలయాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు మాత్రమే సేకరించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దేవాలయం బృహదీశ్వరాలయం..

ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరుకి అత్యంత సమీపాన, ఈ దేవాలయాన్ని నిర్మించి ,సుమారు వెయ్యి సంవత్సరాల పైమాటే. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1003 నుంచి క్రీస్తు శకం 1010 మధ్య సంవత్సరంలో, చోళ వంశానికి చెందిన రాజేంద్ర చోళుడు కట్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుడిని కుంజర రాజరాజ రామ పెరుందాచన్ అనే వాస్తు శిల్పి చేత ఆగమ వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాలలో లిఖించబడింది. ఇక అప్పట్లోనే ఈ గుడిని మొత్తం గ్రానైట్ రాళ్లతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
ఇక ఈ గుడిని నిర్మించడానికి లక్షా 30 వేల టన్నుల గ్రానైట్ రాళ్లను ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడి గాలిగోపురం పై ఉన్న గుండ్రటి కట్టడం ఒకటే మొత్తం 80 టన్నులు ఉంటుంది. ఇక ఈ గోపురం ఎత్తు 216 అడుగులు. క్రేన్లు ,మెషిన్లు వంటి ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండా ,ఆ కాలంలో నే అంతటి పెద్ద రాయిని గోపురం పైన ఎలా పెట్టారు..? అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఈ దేవాలయాన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన గ్రేట్ లివింగ్ చోళ దేవాలయం అని బిరుదు కూడా ఇచ్చారు. ఇక ఈ దేవాలయంలో నంది, పార్వతి ,వినాయకుడు ,కార్తికేయ, దక్షిణామూర్తి, సభాపతి ,చండీశ్వరుడు, వారాహి వంటి దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉండడం గమనార్హం. ముఖ్యంగా బృహదీశ్వరాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తమిళనాడులో అతి ఎక్కువగా సందర్శించే పర్యాటక ప్రాంతాలలో బృహదీశ్వర ఆలయం కూడా ఒకటి. వీటిని బట్టి చూస్తే , భారతదేశం కళల సంస్కృతికి పుట్టినిల్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: