పాలల్లో చక్కెర వేసుకుని తాగుతున్నారా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్టే?

praveen
ఉదయం లేవగానే లేదంటే మధ్యాహ్నం సమయంలో.. లేదంటే సాయంత్రం టైంలోనో ఇలా రోజులో ఏదో ఒకసారి లేదంటే రెండు మూడు సార్లు టీ లేదా కాఫీ తాగే అలవాటు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి కాఫీ తాగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కాస్త రిలీఫ్ దక్కుతుంది అని నేటి రోజుల్లో జనాలు బాగా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే  కాస్త టెన్షన్ గా అనిపించిన.. లేదంటే ఆనందం ఎక్కువైనా కూడా ఇక ఆ ఆనందాన్ని టీ గ్లాస్ తోనే షేర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు.

 అయితే చాలామంది ఇలా టీ కాఫీ ఇలాంటి వాటికి అలవాటు పడితే కొంతమంది మాత్రం ఏకంగా పాలు తాగడం అలవాటు చేసుకుంటారు. అందరూ టీ, కాఫీ తాగినట్లుగానే కొంతమంది ఇక ఆనందం వచ్చిన దుఃఖం వచ్చిన ఒత్తిడి ఉన్న.. పాలు తాగడం చేస్తూ ఉంటారు. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది అని అంటూ ఉంటారు. ఇక మరి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు పేరెంట్స్ కూడా ప్రతిరోజు పాలు తాగేలా చూసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే పాలు తాగే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్ని కొన్ని సార్లు అనారోగ్యాలకి కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు.

 అయితే దాదాపుగా పాలు తాగే అలవాటు ఉన్న చాలా మంది ఇక పాలలో చక్కెర వేసుకొని తాగడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా పాలల్లో చక్కెర వేసుకుని తాగడం ఏమాత్రం మంచిది కాదు అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే పాలల్లో అప్పటికే తగినన్ని క్యాలరీలు ఉంటాయట. ఎక్కువ కాలం చెక్కర కలుపుకొని పాలు తాగడం ద్వారా శరీరానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాలు చక్కెర కలయిక జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందట. ఎసిడిటీ, మలబద్ధకం, డయేరియా, ఫైల్స్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది అని ఇక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: