వామ్మో.. ఉన్నఫలంగా సిగరెట్ మానేస్తే.. ఇన్ని సమస్యలు వస్తాయా?

praveen
మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలుసు. ఇక టీవీలు, సినిమా థియేటర్లలో ఎప్పుడు ఈ విషయాన్ని చూపిస్తూ ఉంటారు. అంతెందుకు ఇక లిక్కర్ సిగరెట్ ప్యాకెట్లపై కూడా ఈ విషయం పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అయితేనేమ్ ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు. ఇక మద్యపానం ధూమపానం చేయడానికి మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒకప్పుడు 50 ఏళ్ల పైబడిన వారు మాత్రమే ఇలా సిగరెట్ సరదా కోసం తాగే అలవాటును చేసుకునే వారు. కానీ ఇప్పుడు స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు అందరూ కూడా సిగరెట్ తాగడం చేస్తూ ఉన్నారు.

 ఇక ఉద్యోగాలు చేసేవారు అయితే సిగరెట్ తాగితే ఏదో తెలియని రిలీఫ్ వస్తుంది అని కారణం చెబుతూ ధూమపానానికి బానిసలుగా మారిపోతూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇలా సిగరెట్ రోజు తాగడం ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. దీనిని అర్థం చేసుకున్న కొంతమంది ఇక ఉన్నఫలంగా సిగరెట్ అలవాటును మానుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఒక్కసారిగా సిగరెట్  తాగడం మానేస్తే ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. ఇలా హఠాత్తుగా సిగరెట్ మానేసే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సంవత్సరాల నుంచి సిగరెట్ తాగుతూ ఉండటం వల్ల శరీరంలోని నికోటిన్ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది.
 దీంతో హఠాత్తుగా సిగరెట్ మానేస్తే ఇక అదే మిమ్మల్ని సిగరెట్ కోసం పరితపించేలా చేస్తుంది. దానివల్ల కొంత చిరాకు, మానసిక కొల్లోలం లాంటి సమస్యలు వస్తాయట. ఇక ఆందోళనకు కూడా దారితీస్తుందట. అంతేకాదు అకస్మాత్తుగా సిగరెట్ మానేస్తే కొంతమందిలో ఇక ఏకాగ్రత అనేది కూడా దెబ్బతింటుందట. అయితే ధూమపానం ఆకలిని అణచివేస్తుంది. కాబట్టి సిగరెట్ మానేయగానే ఇక చాలా మందిలో ఆకలి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీనివల్ల కొందరిలో కొలెస్ట్రాల్ అధికమై బరువు పెరిగే అవకాశం కూడా ఉందట. ఇక కొన్ని రోజుల వరకు నిద్ర విధానాలకు భంగం కలిగే అవకాశం కూడా ఉంటుందట. అందుకే హఠాత్తుగా కాకుండా కొంచెం కొంచెంగా ఈ అలవాటు నుంచి బయట పడటం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: