ఆ దేశంలో పానీపూరిపై నిషేధం.. తెలిస్తే అమ్మాయిలు ఇక అక్కడికి చచ్చిన వెళ్లరేమో?

praveen
పానీపూరి ఈ పేరు చెబితే చాలు చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరి నోరు ఊరిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇండియాలో ఎన్నో రకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్న ఎందుకో చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా పానీపూరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక అమ్మాయిలు అయితే పానీపూరి బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎంత తింటున్నామో కూడా తెలియకుండా పానీ పూరి తినేస్తూ ఉంటారు  అంతలా ఇండియాలో పానీ పూరికి క్రేజ్ ఉంది.

 మురికి కాలువ పక్కన పెట్టి పానీ పూరి అమ్ముతున్న.. అక్కడ తింటే ఏదైనా రోగాలు వస్తాయి అనే అనుమానం అందరికీ ఉన్న.  ఎందుకో పానీపూరి తినడానికి మాత్రం ఎక్కడా వెనకడుగు వేయరు . అయితే పానీ పూరి తింటుంటే కడుపు నిండిపోతూ ఉంటుంది. కానీ మనసు మాత్రం ఇంకా ఖాళీగానే ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఇండియాలో బాగా ఫేమస్ అయి అందరికీ ఫేవరెట్ గా మారిపోయిన పానీ పూరి ఏకంగా ఒక దేశంలో బ్యాన్ చేశారట  వినడానికి షాకింగ్ గా ఉంది కదా. కానీ నేపాల్ లో నిజంగానే పానీపూరిపై నిషేధం విధించారట.

 పానీపూరి విషయంలో ఎంత హైజానిక్ గా ఉన్నప్పటికీ అంటువ్యాధులు ప్రబలే అవకాశముంది అని భావించిన ప్రభుత్వం.. వెంటనే ఈ పానీ పూరిని బ్యాన్ చేసేసిందట  2022 లోనే ఈ పానీ పూరి కారణంగా ఏకంగా నేపాల్ లో 30 మందికి కలర్ వచ్చిందట. దీంతో ఇక ప్రభుత్వం పానీపూరి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంది. ఏకంగా  ఎక్కడా పానీ పూరి అమ్మకుండా నిషేధం విధించింది. నేపాల్ రాజధాని అయిన ఖాట్మండులో గల లలిత్పూర్ అనే ప్రాంతంలో పానిపూరితో పాటు పలు స్ట్రీట్ ఫుడ్స్ పైన కూడా నిషేధం విధించారు  ఆ ప్రాంతంలోనే ఎక్కువగా కలరా వ్యాధి విజృంభిస్తున్న  నేపథ్యంలో ఇలా పానీ పూరి సహా వీధుల్లో అమ్మే చాలా ఐటమ్స్ పై కూడా ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది. తర్వాత అన్నింటి మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేసిన పానీ పూరి మీద విధించిన వ్యాన్ మాత్రం ఎత్తి వేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: