మీకు మద్యం తాగే అలవాటు ఉందా.. అయితే మీ పిల్లలు ప్రమాదంలో పడ్డట్టే?

praveen
ఇటీవల కాలంలో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే ఆహారం తినడం.. నీళ్లు తాగడం ఎలా అయితే మనిషి జీవితంలో భాగమైందో.. ఇక మద్యం సిగరెట్ కూడా అలాగే భాగంగా మారిపోయాయి అని చెప్పాలి. నేటి రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా సిగరెట్ మద్యానికి బాగా అలవాటు పడిపోతున్నారు. కొంతమంది బానిసలుగా కూడా మారిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు మద్యం తాగే వాడిని విచిత్రంగా చూసేది ఈ సమాజం. కానీ ఇప్పుడు ఎవరైనా మద్యం  తాగలేదు అని చెబుతున్నారు అంటే వారిని విచిత్రంగా చూడటం చేస్తూ ఉన్నారు.

 అయితే మద్యపానం అలవాటు కారణంగా కొంతమంది ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటుంటే ఇంకొంతమంది చివరికి కుటుంబం రోడ్డున పడే పరిస్థితికి కారణమవుతూ ఉన్నారు. అయితే మద్యపాన అలవాటు ఏకంగా పుట్టబోయే పిల్లలకు కూడా ప్రమాదకరంగా మారుతుంది అని ఇటీవల ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. పురుషుడి మద్యపాన అలవాటు అతని భాగస్వామి గర్భం దాల్చడానికి ఆటంకంగా మారుతుందని.. ఒకవేళ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయినప్పటికీ పిండం అభివృద్ధిపై నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే పురుషుల నుంచి వచ్చే వీర్యం ద్వారా గర్భం దాల్చిన మహిళకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయట. పిండం డెవలప్మెంట్ సరిగా ఉండదని డాక్టర్లు నిర్ధారించినప్పుడు మానసికం గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందట. ఇక మద్యపానం అలవాటు కారణంగా పుట్టిన పిల్లల్లో ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్, బ్రెయిన్ అండ్ ఫేషియల్ డిఫెక్ట్ వంటి రుగ్మతలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందట. ఇలాంటి రుగ్మతలు శారీరక సమస్యలు, బిహేవియర్ లెర్నింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కి కారణం అవుతాయట. అంతేకాదు మద్యం సేవించడం వల్ల స్పర్మ్ కౌంట్ కూడా తగ్గుతుందని సెక్సువల్ డిజాస్టర్లు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: