లిప్ స్టిక్ పెదాలకు వేసుకుంటున్నారా.. అయితే ప్రమాదమే..!!

Divya
ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం నగలతో పాటు ఇతరత్రా వాటిని కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు పెదాలు చాలా అందంగా కనిపించడానికి చాలా మంది ఈ మధ్యకాలంలో లిప్ స్టిక్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇదే కాకుండా పలు రకాల కెమికల్స్ తో కూడిన క్రీమ్స్ ను కూడా ఫేస్ కి అప్లై చేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణుల సైతం తెలియజేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కచ్చితంగా ఈ లిప్ స్టిక్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు.
 లిప్ స్టిక్ పెదాలకు అప్లై చేసేవారు వీటిని కచ్చితంగా చదవాల్సిందే.. లిప్ స్టిక్ లో కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తారట. అందుకే వీటి వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. లిప్ స్టిక్ తయారీలో సీసం ,మాంగనీస్, మెగ్నీషియం వంటి రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తారట. అలా లిప్ స్టిక్ ను  ఉపయోగించడం వల్ల మన శరీరంలో అలర్జీల సమస్య కూడా తలెత్తుతుందని నిపుణులు తెలుపుతున్నారు. లిప్ స్టిక్ అప్పుడప్పుడు పెదాలను తడుపుతూ ఉంటారు కనుక ఆ కెమికల్ నేరుగా కడుపులోకి వెళ్తుంది.

ఫలితంగా పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే గర్భిణ మహిళలు ఇలాంటి వాటిని ఉపయోగించడం చాలా ప్రమాదకరం ఇందులో కెమికల్స్ నోట్లోకి వెళితే తల్లితో పాటు బిడ్డకు కూడా చాలా ప్రమాదం ఉంటుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. వీటి ద్వారా క్యాన్సర్ కు కారం అయ్యే పెట్రో కెమికల్స్  ను కూడా ఇందులో ఉపయోగిస్తారని నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల శరీర అభివృద్ధికి కూడా తీవ్రమైన ప్రమాదం ఉంటుందట. అందుచేతనే లిప్ స్టిక్ ఉపయోగించకపోవడమే మంచిది కాదని చాలామంది నిపుణుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఇలాంటివి తగ్గించుకుంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: