
ఇంతకీ పిల్లలు పుట్టకపోవడంతో.. 50 ఏళ్ల వయసులో అలా చేసింది.. చివరికి?
ఎందుకంటే పెళ్లయి ఏళ్లు గడుస్తున్న ఇక పిల్లలు కాక ఎంతోమంది బాధపడిపోతూ ఉంటారు. ఒకవైపు సభ్య సమాజం నుంచి అవమానాలు.. ఇంకోవైపు నుంచి పిల్లలు లేరు అనే బాధ ఇక వారిని చుట్టుముట్టేస్తూ ఉంటుంది. అయితే డాక్టర్ల చుట్టూ తిరిగితే ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు అని చెబుతుంటారు. దీంతో చాలామంది ఇక పిల్లలు పుట్టాలని పూజలు పునస్కారాలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన వినూత్నమైన టెక్నాలజీ ఆధారంగా ఎంతోమంది మహిళలు పెళ్లయిన చాలా రోజులకి మాతృత్వం అనుభూతిని పొందగలుగుతున్నారు.
ఇక్కడ ఒక మహిళకు ఏకంగా 50 ఏళ్ల వయసులో అమ్మ కావాలని కోరిక తీరింది. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఈ ఘటన జరిగింది. చిత్తూరు జిల్లా వరత్తూరుకు చెందిన 50 ఏళ్ల మహిళ కన్నారెడ్డి సిద్ధమ్మ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. అయితే వివాహం అయిన తర్వాత ఆమెకు పిల్లలు కాలేదు. కాగా గత ఏడాది చెన్నైలోని ఒక ఆసుపత్రిలో ఐవిఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చింది. ఇక ఇటీవల తిరుపతిలోని ప్రకృతి హాస్పిటల్ లో చేరగా వైద్యులు సిజేరియన్ చేశారు. కాగా ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చింది సదరూ మహిళ. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.