పిచ్చి మొక్కగా అనుకునె అడవి ఆముదం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

Divya
సాధారణంగా పొలాల్లో అడవి ఆముదంపెరుగుతూ ఉంటుంది. అని వాటిని ఒక పిచ్చి ముక్కగా అనుకొని పీకు పడేస్తూ ఉంటారు. దీనిని జట్రోఫా, దొబ్బ చెట్టు అని కూడా అంటారు.దీని ఆకులు,బెరడు,విత్తనాలు ఆయుర్వేదంలో అధికంగా ఉపయోగపడతాయి. దీనిని తుంచితే పాల వంటి పదార్థం వస్తుంది. దీనిని గుర్తించడం చాలా ముఖ్యం.దీని ఆకులు అండాకారంలోను, పువ్వులు పచ్చగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి.
 జాయింట్ పెయిన్స్..
 చాలామంది జాయింట్ పెయిన్స్ తో ఉదయాన్నే లేచిన తర్వాత గంటపాటు ఏ పని చేసుకోలేకపోతారు. సూదులతో గుచ్చినట్టు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాంటివారు ఈ అడవి ఆముదం బెరడును తీసుకొని, దంచి సాధారణ ఆముదంతో జాయింట్ పెయిన్స్ ఉన్నచోట పట్టుల వేయాలి. ఇలా చేస్తూ ఉంటే జాయింట్ పెయింట్స్ నుంచి, మరియు ఇతర నొప్పుల నుంచి  తొందరగా ఉపశమనం కలుగుతుంది.
 సెగగడ్డలు..
 శరీరంలో వేడివల్ల సెగగడ్డలు వస్తూ ఉంటాయి. అలా సెగగడ్డలు వచ్చినప్పుడు అడవి ఆముదం ఆకులను తీసుకొని, సాధారణ ఆముదం కలిపి  బాగా దంచి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. దానిని ఒక గుడ్డలో పెట్టి , నిప్పుల వేడికి ఉంచి, గోరువెచ్చగా ఉన్నప్పుడు సెగగడ్డలపై పట్టీల కట్టాలి. ఇది సెగగడ్డలను  మెత్తగా చేసి,నిర్వీర్యం చేస్తుంది.
 గజ్జి వంటి చర్మ వ్యాదులు..
 గజ్జి,తామర, అలేర్జి వంటి చర్మ వ్యాధులతో బాగా ఇబ్బంది పడేవారు, ఈ అడవి ఆముదం గింజలను తీసుకుని, వాటి నుంచి నూనె తీసి, నిల్వ ఉంచుకోవాలి. ఆ నూనెను ఈ చర్మ సమస్యలు గల ప్రదేశంలోపూస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా పూయడం వల్ల ఎటువంటి చర్మ సమస్యలైన ఈజీగా తగ్గుముఖం పడతాయి.
కండరాల నొప్పులు..
 చాలామంది బాడీపెయిన్స్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి అడవి ఆముదం నూనె  బాగా సహాయపడుతుంది. అడవి ఆముదంగింజల నుంచి తీసిన నూనెను, కొబ్బరినూనెతో కలిపి వెచ్చగా చేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే బాడీపెయిన్స్ ఉన్నచోట బాగా మర్దన చేసుకోవాలి. ఒక గంట తర్వాత తర్వాత వేడినీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: