రోజు ఈ మిశ్రమం తిన్నారంటే చాలు.. రోగాలన్నీ పరార్..!!
జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. తేనే, వెల్లుల్లి కలిపిన మిశ్రమం తినడం వల్ల జలుబు , దగ్గు సమస్య తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు వాపు, గొంతు నొప్పిని తగ్గిస్తాయి. ఇక నొప్పి , కఫం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. వెల్లుల్లిని తేనెలో కలిపి తీసుకోవడం వల్ల అధిక కొవ్వు కూడా తగ్గిపోతుంది. ఇక ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకోవాలి. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ప్రతిరోజు వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని కలిపి తినడం వల్ల ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవచ్చు. ఇది రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇక వెల్లుల్లి, తేనె మిశ్రమం కడుపు సంబంధిత రుగ్మతలను తొలగిస్తుంది. జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. కడుపు ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటే మీ ఆహారంలో వెల్లుల్లి , తేనే తీసుకోవాలి. ఇక ఈ మిశ్రమం మీకు అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఈ మిశ్రమం తీసుకుంటూ ఉండాలి.